ఆర్టికల్ 370 రద్దు అంతర్జాతీయంగా సంచలనం రేపిన అంశం. భారత ప్రధాని నరేంద్రమోడీ ఈ సాహసోపేత నిర్ణయం తీసుకుని అమలు చేశారు. పార్లమెంట్ లో బిల్లు పాస్ కావడంతో ప్రస్తుతం కాశ్మీర్ పూర్తిస్థాయిలో ఇండియాలో అంతర్భాగం అయింది. ఆర్టికల్ 370 రద్దుపై పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఆర్టికల్ 370 రద్దుపై చేసిన వ్యాఖ్యలు ఆమెపై ట్రోలింగ్ కు దారితీశాయి. సోనమ్ కపూర్ మాట్లాడుతూ.. ఒకప్పుడు ఇండియా, పాక్ ఓకే దేశంగా ఉండేవి. కానీ ఆర్టికల్ 370 అనేదాన్ని నేను రాజకీయంగానే భావిస్తాను. రాజకీయ కారణాలవల్ల ఇరు దేశాల మధ్య ఇలాంటి పరిస్థితి నెలకొంది. ఇది నిజంగా హార్ట్ బ్రేకింగ్. 

ఇరు దేశాల మధ్య పరిస్థితులు సద్దుమణగడానికి కొంత సమయం ఇవ్వాలి అని సోనమ్ వ్యాఖ్యానించింది. సోనమ్ కపూర్ వ్యాఖ్యలు ఆర్టికల్ 370 రద్దు ఆమెకు ఇష్టం లేదనే విధంగా ఉన్నాయని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు ని స్వాగతించకుండా ఏదేదో మాట్లాడుతోందని అంటున్నారు. 

తన కుటుంబానికి పాకిస్తాన్ తో రిలేషన్ కూడని కూడా సోనమ్ తెలిపింది. ఇక తన చిత్రాలని కూడా పాక్ ప్రేక్షకులు ఆదరిస్తారని సోనమ్ చెప్పుకొచ్చింది. పాక్ ప్రభుత్వం ఇండియన్ చిత్రాలపై బ్యాన్ విధించడాన్ని సోనమ్ తప్పుబట్టింది. కానీ నెటిజన్లు ఇవేమి గమనించకుండా ఆర్టికల్ 370 రద్దుపై ఆమె ఇచ్చిన వివరణని మాత్రం తప్పుబడుతున్నారు. తనపై వస్తున్న ట్రోలింగ్ ని ఇప్పటికైనా ఆపాలని, తన వ్యాఖ్యలని వక్రీకరిస్తున్నారని సోనమ్ సోషల్ మీడియాలో వివరణ ఇచ్చింది.