ఆ హీరోయిన్ కావాలనే పెళ్లి వాయిదా వేసిందట!

sonam kapoor postponed her wedding for swara bhaskar
Highlights

బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ అహూజాను వివాహం

బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ అహూజాను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మే 8న వీరి వివాహం జరిగింది. అయితే నిజానికి సోనమ్ పెళ్లి మార్చి 12నే జరగాల్సివుందట. 

కానీ కావాలనే ఆమె వాయిదా వేసినట్లు తెలుస్తోంది. సోనమ్ కు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్ అంటే అది స్వర భాస్కరే.. ఈ విషయాన్ని సోనమ్ కూడా పలు సందర్భాల్లో వెల్లడించింది. అయితే సోనమ్ పెళ్లి చేసుకోవాలనుకున్న రోజు(మార్చి 12)నే స్వర భాస్కర్ సోదరుడు ఇషాన్ పెళ్లి కూడా పెట్టుకున్నారట. తన స్నేహితురాలు తన పెళ్లికి హాజరు కాకపోతే ఎలా అని ఇషాన్ పెళ్లి డేట్ మార్చమని స్వరా భాస్కర్ ను అడిగిందట సోనమ్.

కానీ అది కుదరకపోవడంతో సోనమే తన పెళ్లి డేట్ ను మార్చుకొని స్వరాకు స్వీట్ షాక్ ఇచ్చిందట. ఈ విషయాన్ని స్వర భాస్కర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి నటించిన 'వీరే ది వెడ్డింగ్' సినిమా జూన్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

loader