ఒకప్పుడు నల్లగా, పొడుగ్గా ఉండడంతో చాలా మంది తనను ఎగతాళి చేసేవారని నటి సోనం కపూర్ కొన్ని వ్యాఖ్యలు చేసింది. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ వ్యాఖ్యాతగా 'పించ్' అనే షో నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే.

ఈ షోలో పాల్గొన్న సోనం తాను ఎదుర్కొన్న బాడీ షేమింగ్ అనుభవాల గురించి వెల్లడించింది. ఒకప్పుడు తాను పొడుగ్గా, నల్లగా ఉండడంతో చాలా మంది ఎగతాళి చేసేవారని, ఇలా ఉంటే నిన్నెవరు పెళ్లి చేసుకుంటారని వేలెత్తి చూపేవారని తెలిపింది. 

అయితే అలా కామెంట్ చేసేవారి పట్ల తాను ఎప్పుడు కోపం ప్రదర్శించలేదని, తనను ద్వేషించేవారిని శ్రేయోభిలాషులుగా భావించి వారి మాటలను చాలెంజింగ్ గా తీసుకొని తనేంటో నిరూపించుకున్నట్లు చెప్పుకొచ్చింది. 

ఫిట్ నెస్ పై దృష్టి పెట్టినట్లు, ప్రేమించిన వ్యక్తినే సొంతం చేసుకున్నానని.. ఇంతకంటే నిరూపించుకోగలిగేది ఇంకేముంటుందని వెల్లడించింది. ప్రస్తుతం ఈ భామ 'జాయా ఫ్యాక్టర్' అనే సినిమాలో నటిస్తోంది. ఇందులో దుల్కర్ సల్మాన్ హీరోగా కనిపించనున్నారు. అభిషేక్ శర్మ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా జూన్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.