సోనమ్ కపూర్ మరోమారు తన పెదనాన్న కుమార్తె జాన్వీ కపూర్ పై ఉన్న ప్రేమని బయట పెట్టింది. అందాల మెరుపు తీగ కత్రినా కైఫ్ ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సరసన నటించిన భారత్ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో బిజీగా గడుపుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జాన్వీ కపూర్ గురించి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. 

జాన్వీ కపూర్ కు సలహాలు ఇవ్వడానికి ఆ వ్యాఖ్యలు చేసినట్లు ఉంది. కానీ కత్రినా వ్యాఖ్యల పట్ల సోనమ్ కపూర్ సీరియస్ అయింది. కత్రినా మాట్లాడుతూ.. జాన్వీ కపూర్ మరీ పొట్టిగా ఉండే దుస్తులు వేసుకుని తిరుగుతోంది. జాన్వీ విషయంలో అదే నా భయం. ప్రతి రోజు మేమిద్దరం జిమ్ లో కలుసుకుంటాం. ఆమె పొట్టి దుస్తులు వేసుకోవడం వల్ల బయట ఉండే ఫోటో గ్రాఫర్స్ అంతా ఎగబడి ఫోటోలు తీస్తున్నారు. అవి వైరల్ అవుతున్నాయి అని కత్రినా తెలిపింది. 

కత్రినా వ్యాఖ్యలపై సోనమ్ కపూర్ స్పందించింది. జాన్వీ కపూర్ పొట్టి దుస్తులు మాత్రమే కాదు.. రెగ్యులర్ డ్రెస్సెస్ కూడా వేసుకుంటుంది. అందులో కూడా జాన్వీ అందంగా ఉంటుంది అంటూ కత్రినాకు కౌంటర్ ఇచ్చింది. గతంలో పలువురు నెటిజన్లు జాన్వీ కపూర్ డ్రెస్ ని ట్రోల్ చేసిన సంధర్భంలో అర్జున్ కపూర్ వారికి కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.