టాలీవుడ్ బాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని బాషల ప్రేమికులను తన అభినయంతో ఆకట్టుకున్న నటి సోనాలి బింద్రే. కొన్ని నెలల క్రితం సోనాలి క్యాన్సర్ చిక్కిత్స కోసం విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఏ మాంత్రం భయపడకుండా తనకు తానే ఆత్మ స్థైర్యాన్ని నింపుకొని ఇన్ని రోజులు అమెరికాలో చిక్కిత్స చేయించుకుంది. 

అప్పుడపుడు తనకు సంబందించిన పోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ తాను బాగానే ఉన్నాను అంటూ శ్రేయోభిలాషులకు కూడా ఆనందాన్ని ఇచ్చిన ఆమె ఇప్పుడు ఇండియాకి వచ్చేసింది. సగం ట్రీట్ మెంట్ అయిపోవడంతో కొన్ని రోజులు విశ్రాంతి కోసం స్వదేశానికి తిరిగి రావడానికి సిద్ధమైంది. 

ముంబై ఎయిర్ పోర్ట్ కి రానున్నట్లు తెలుసుకొని అభిమానులు ఆమెకు వెల్కమ్ చెప్పడానికి సిద్ధమయ్యారు. ఇక సినిన్ ప్రముఖులు కుటుంబ సభ్యులు సొనాలికి ప్రత్యేకంగా కలుసుకునేందుకు ఆమెనివాసానికి వెళ్లనున్నారు. సోషల్ మీడియాలో కూడా నెటిజన్స్ త్వరగా సోనాలి కోలుకొని మళ్ళి తెరపై కనిపించాలని కోరుకుంటున్నారు.