టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ సక్సెస్ గర్ల్ గా గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ సోనాలి బింద్రే. ఖడ్గం - మన్మథుడు - శంకర్ దాదా MBBS వంటి సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీని తెలుగు ఆడియెన్స్ ఎప్పటికి మరచిపోలేరు. అయితే కొంత కాలంగా సోనాలి క్యాన్సర్ తో బాధపడిన సంగతి తెలిసిందే. 

చిక్కిత్స కోసం విదేశాలకు వెళ్లి ఎంతో ధైర్యంగా క్యాన్సర్ ను ఎదుర్కొన్న సోనాలి మళ్ళీ ఇండియాలో అడుగుపెట్టింది. ఎన్ని రోజులని రెస్ట్ తీసుకుంటామంటూ మంటూ మళ్ళీ తన పనిని మొదలెట్టింది. షూటింగ్ కు ఎప్పటిలానే పాల్గొంటూ మరోసారి బుల్లితెరలో షోలకు జడ్జ్ గా వ్యవహరించనుంది. క్యాన్సర్ చిక్కిత్స కోసం వెళ్ళినప్పుడు జట్టు లేకుండా ఊహించని విధంగా కనిపించి సొనాలి ఫ్యాన్స్ కు ఇచ్చిన షాక్ మరువలేనిదీ. 

ఇక ఇప్పుడు తన అసలైన అందంతో అమ్మడు అభిమానుల ముందుకు రానుంది. రెగ్యులర్ గా తన లైఫ్ స్టైల్ ని సోషల్ మీడియాలో నెటిజన్స్ తో షేర్ చేసుకుంటోంది. చిక్కిత్స కోసం మరోసారి సోనాలి న్యూ యార్క్ వెళ్లాల్సి ఉంది.