Asianet News TeluguAsianet News Telugu

తనకంటే చిన్నవాడైన కుర్ర హీరోతో సోనాక్షి సిన్హా పెళ్లి.. మెహందీ ఫొటోస్ వైరల్

సోనాక్షి సిన్హా ఫ్యాన్స్ కి స్వీట్ షాక్ ఇస్తోంది. ఎలాంటి హడావిడి లేకుండా సీక్రెట్ గా పెళ్లి చేసుకుంటోంది. బాలీవుడ్ లో రాణిస్తున్న జహీర్ ఇక్బాల్ అనే యువ హీరోతో సోనాక్షి సిన్హా వివాహం ఆదివారం రోజు జూన్ 23న ముంబై లో జరగబోతోంది.

Sonakshi Sinha wedding with this hero, mehndi photos viral dtr
Author
First Published Jun 22, 2024, 5:28 PM IST

గ్లామర్ బ్యూటీ సోనాక్షి సిన్హా ప్రస్తుతం వెబ్ సిరీస్ లతో కూడా రాణిస్తోంది. సల్మాన్ ఖాన్ సరసన దబాంగ్ లాంటి బ్లాక్ బస్టర్ సిరీస్ లో నటించి మెప్పించింది. దబంగ్ చిత్రం రీసౌండింగ్ హిట్ కావడంతో సోనాక్షి పేరు మారుమోగింది.   ఇటీవల కొంత కాలంగా సోనాక్షి హవా బాలీవుడ్ లో బాగా తగ్గింది. కానీ గ్లామర్ పరంగా సోనాక్షి సిన్హా కుర్రాళ్ళ కలల రాణిగా మారిపోయింది. 

తాజాగా సోనాక్షి సిన్హా ఫ్యాన్స్ కి స్వీట్ షాక్ ఇస్తోంది. ఎలాంటి హడావిడి లేకుండా సీక్రెట్ గా పెళ్లి చేసుకుంటోంది. బాలీవుడ్ లో రాణిస్తున్న జహీర్ ఇక్బాల్ అనే యువ హీరోతో సోనాక్షి సిన్హా వివాహం ఆదివారం రోజు జూన్ 23న ముంబై లో జరగబోతోంది. ఆల్రెడీ పెళ్లి కార్యక్రమాలు జరుగుతున్నాయి. 

సోనాక్షి మెహందికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత కొంతకాలంగా సోనాక్షి, జహీర్ ప్రేమలో ఉన్నారు. జహీర్ సోనాక్షి కంటే రెండేళ్లు వయసులో చిన్నవాడు. అయినప్పటికీ వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. 

డబుల్ ఎక్స్ ఎల్ అనే చిత్రంలో సోనాక్షి, జహీర్ కలసి నటించారు. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. సోనాక్షి సిన్హా తన ప్రేమ గురించి కానీ, పెళ్లి గురించి కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆమె సెలెబ్రిటీ కాబట్టి ఆమె పెళ్లి విషయం ఇలా లీక్ అయింది. 

 

వీలైనంత వరకు తన పర్సనల్ లైఫ్ విషయాలని సోనాక్షి సీక్రెట్ గా ఉంచాలని భావిస్తోందట. మెహందీ వేడుకలో సోనాక్షి తనకి కాబోయే వాడితో సంతోషంగా ఉంది. సోనాక్షి పెళ్ళికి అతి కొద్దిమంది బంధువులు, మిత్రులు హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios