ఇటీవల తమిళ హీరో ఒకరు ఐఫోన్ ఆర్డర్ చేస్తే డమ్మీ ఐఫోన్ ని పంపించింది  ఈకామర్స్ సంస్థ. దీనిపై పెద్ద గొడవే జరిగింది. ఫైనల్ గా హీరో ఒరిజినల్ ఫోన్ దక్కించుకున్నాడు. ఇప్పుడు ఇలాంటి ఓ అనుభవం బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హాకి ఎదురైంది.

ప్రముఖ బ్రాండ్ కి చెందిన హెడ్ ఫోన్స్ ని ఆర్డర్ చేస్తే సోనాక్షికి ఇనుప ముక్కలు పార్సెల్ లో వచ్చాయట. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. 18 వేల రూపాయలు పెట్టి హెడ్ ఫోన్స్ ఆర్డర్ పెట్టిన తనకు ఇనుప ముక్కలు వచ్చాయని, దాంతో షాక్ అయినట్లు అమెజాన్ ని ట్విట్టర్ లో ట్యాగ్ చేసి మరీ విషయాన్ని షేర్ చేసింది.

ప్యాకేజ్ తన వద్దకి వచ్చినప్పుడు ఎలాంటి అనుమానం రాలేదని, దీంతో వెంటనే ఓపెన్ చేసి చూస్తే అందులో హెడ్ ఫోన్స్ కి బదులు ఇనుప ముక్కలు ఉన్నట్లు చెప్పుకొచ్చింది. కస్టమర్ సర్వీస్ ని సంప్రదిస్తే వారు ఇచ్చిన సమాధానం కూడా సరిగ్గా లేదని అంటోంది సోనాక్షి.

ఈ విషయాన్ని అంత ఈజీగా వదలని చెబుతోంది. మరి దీనిపై అమెజాన్ సంస్థ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి!