ప్రస్తుతం ట్విట్టర్ లో  #YoSonakshiSoDumb అనే హ్యాష్ ట్యాగ్ టాప్ ట్రెండింగ్స్ లో రెండో స్థానంలో ఉంది. నెటిజన్లు ఆమెని టార్గెట్ చేస్తూ ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్‌పతి షోకి శుక్రవారం నాడు గెస్ట్ గా వచ్చారు సోనాక్షి.  

ఆమెతో పాటు తల్లి పూనమ్ సిన్హా కూడా వచ్చారు. సోనాక్షి కో పార్టిసిపెంట్‌గా రాజస్థాన్‌కు చెందిన ప్రముఖ సామాజికవేత్త రూమా పాల్గొన్నారు. వీరిద్దరూ కలిసి గేమ్ ఆడారు. తొలి రౌండ్ లోనే ప్రశ్నలన్నింటికీ లైఫ్ లైన్లు వాడిన వీరిద్దరికీ రామాయణానికి సంబంధించిన ప్రశ్న ఎదురైంది.

‘రామాయణం ప్రకారం.. హనుమంతుడు ఎవరి కోసం సంజీవని తెచ్చాడు?’ అని అమితాబ్ ప్రశ్నించి.. దానికి ఆప్షన్స్ గా ఎ. సుగ్రీవుడు, బి. లక్ష్మణుడు సి. సీత, డి.రాముడు అని ఇచ్చారు. రామాయణం మీద కొంచెం నాలెడ్జ్ ఉన్నా.. సమాధానం 'లక్ష్మణుడు' అని కరెక్ట్ గా చెప్పేవారు.

కానీ సోనాక్షికి రామాయణం గురించి తెలియక దీనికి కూడా లైఫ్ లైన్ తీసుకున్నారు. లైఫ్ లైన్ తీసుకునే ముందు 'సీత' అయి ఉంటుందని గెస్ చేసింది. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఆమెని ఏకిపారేస్తున్నారు. ''రామాయణం గురించి ఏమీ తెలుసుకోకుండానే తమ ఇంటికి రామాయణ అని పేరు పెట్టుకున్నారు'' అంటూ సోనాక్షిని టార్గెట్ చేస్తున్నారు. ఆ కామెంట్స్ పై మీరు కూడా ఓ లుక్కేయండి!