బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ పై ప్రముఖ గాయని సోనా మొహాపాత్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సల్మాన్ నటించిన 'భారత్' సినిమాలో మొదట హీరోయిన్ గా ప్రియాంక చోప్రాని తీసుకున్నారు. కానీ ఆమె తన పెళ్లి కోసం సినిమా నుండి తప్పుకుంది.

సల్మాన్ డేట్స్ లో మార్పులు చేస్తానన్నా కూడా ప్రియాంక వినలేదు. దాంతో ఆమె స్థానంలో కత్రినా కైఫ్ ని తీసుకున్నారు. ప్రియాంకా తన సినిమా నుండి తప్పుకోవడం సల్మాన్ కి నచ్చలేదు. దీంతో సమయం దొరికిన ప్రతీసారి ఆమెపై కామెంట్స్ చేస్తూనే ఉన్నాడు.

ప్రియాంకకు 'భారత్' కంటే అమెరికా ఎక్కువైపోయిందని భర్త కోసం 'భారత్'నే వదులుకున్నారని విమర్శించాడు. దీంతో సోనా మొహాపాత్ర సోషల్ మీడియా వేదికగా సల్మాన్ పై ఫైర్ అయింది. ప్రియాంకకు జీవితంలో చేయాల్సిన ముఖ్యమైన పనులు చాలానే ఉన్నాయి కాబట్టి ఆమె 'భారత్' నుండి తప్పుకున్నారని, తన భర్తతో.. కుటుంబంతో ఉండాలనుకుందని చెప్పుకొచ్చింది. 

అన్నిటికంటే ముఖ్యంగా తన ప్రయాణంతో ఎందరో ఆడపిల్లలకు స్పూర్తిగా నిలుస్తుందని తెలిపింది. అయినా ఈ దేశంలో లేని అమ్మాయి గురించి కామెంట్లు చేయడమెందుకు..? అదికాకుండా పక్కనే మరో అమ్మాయి(కత్రినా)ఉండగా ప్రియాంకపై కామెంట్స్ చేయడం నీచమైన పని అంటూ సల్మాన్ పై  ఆగ్రహం వ్యక్తం చేసింది.