బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అభిమానులు తనను బెదిరిస్తున్నారని సింగర్ సోనా మొహాపాత్ర కామెంట్స్ చేసింది. 'భారత్' సినిమా నుండి ప్రియాంక చోప్రా తప్పుకున్నారనే కోపంతో సల్మాన్ కొన్ని రోజులుగా ఆమెని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

దీంతో కొందరు ప్రియాంకకు మద్దతిస్తూ ట్వీట్ లు పెట్టారు. వారిలో సోనా కూడా ఒకరు. అయితే ఆమె సల్మాన్ ని తప్పుబడుతూ పక్కన ఒక అమ్మాయి ఉండగా మరో అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడుతున్నారని ఇది చాలా నీచమైన పని అంటూ కామెంట్స్ చేసింది. దాంతో సల్మాన్ అభిమానులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నోరు అదుపులో పెట్టుకోకపోతే చంపేస్తామంటూ బెదిరింపులకు దిగారు. అసభ్యకరంగా కామెంట్స్ చేస్తూ మెయిల్స్ కూడా పంపుతున్నారు. ఈ విషయాన్ని సోనా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

'ఇలాంటి బెదిరింపు మెయిల్స్ నాకు రోజు వస్తూనే ఉంటాయి. తప్పుగా వ్యాఖ్యలు చేసే సల్మాన్ ఖాన్ 'భారత్' టైటిల్ తో సినిమా చేయడం హాస్యాస్పదంగా ఉంది' అంటూ రాసుకొచ్చారు. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు 'భారత్' సినిమా టీమ్ కానీ శంకర్ కానీ స్పందించలేదు.