Asianet News TeluguAsianet News Telugu

అల్లు అర్జున్‌ ‘ఆర్య’ బడ్జెట్ , లాభం లెక్కలు!

అల్లు అర్జున్ హీరోగా అనూ మెహతా హీరోయిన్ గా సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ‘ఆర్య’. సుకుమార్ ది ఇది తొలి చిత్రం. ఎటువంటి ఎక్సపెక్టేషన్స్ లేకుండా విడుదలైన ఈ చిత్రం ఘన విజయాన్ని సొంతం చేసుకుంది ..! 

Some of the interesting facts about the Allu Arjun starrer Arya jsp
Author
Hyderabad, First Published May 7, 2021, 6:50 PM IST

2004 వ సంవత్సరం మే 7న ఈ చిత్రం విడుదల అయ్యిన చిత్రం ఆర్య. డెబ్యూ మూవీ ‘గంగోత్రి’ తో హిట్ కొట్టిన బన్నీ నుండీ వచ్చిన 2వ చిత్రమిది. శివ బాలాజీ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించాడు. అల్లు అర్జున్ హీరోగా అనూ మెహతా హీరోయిన్ గా సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ‘ఆర్య’. సుకుమార్ ది ఇది తొలి చిత్రం. ఎటువంటి ఎక్సపెక్టేషన్స్ లేకుండా విడుదలైన ఈ చిత్రం ఘన విజయాన్ని సొంతం చేసుకుంది ..! 

నేటితో ఈ చిత్రం విడుదలయ్యి 17 ఏళ్ళు పూర్తి కావస్తోంది. అదే దర్సకుడు, హీరో కాంబినేషన్లో ఇప్పుడు ‘పుష్ప’ చిత్రం కూడా రూపొందుతుండడంతో..‘#17YearsForArya,#17YearsForMagicalAARYA,#17YearsForAARYA,#Aarya’ వంటి హ్యాష్ ట్యాగ్ లతో ట్రెండ్ చేస్తున్నారు బన్నీ అభిమానులు.

అప్పట్లో ఈ చిత్రం నాలుగు కోట్ల బడ్జెట్ తో రూపొందింది. . ఇక దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ కు అప్పట్లో సెన్సేషన్. సాంగ్స్ అన్నీసూపర్ హిట్సే. మెల్లిగా హిట్ టాక్ తెచ్చుకుని, వీకెండ్ తర్వాత వరసగా హౌజ్ ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. 56 సెంటర్లలో 100రోజులు ఆడింది. ఆ సినిమాతో దిల్ రాజు స్టార్ ప్రొడ్యూసర్ గా గుర్తింపు అందుకున్నాడు. 

  బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :

నైజాం    5.80 cr
సీడెడ్    2.12 cr
ఉత్తరాంధ్ర    3.02 cr
ఈస్ట్    0.87 cr
వెస్ట్    0.79 cr
గుంటూరు    1.30 cr
కృష్ణా    1.09 cr
నెల్లూరు    0.72 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)    15.71 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్      2.42 cr
వరల్డ్ వైడ్ (టోటల్)     18.13 cr

‘ఆర్య’ చిత్రానికి రూ.9.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.18.13 కోట్ల షేర్ ను రాబట్టింది. అంటే ఈ చిత్రం కొనుగోలు చేసిన బయ్యర్లకు రూ.8.93 కోట్ల లాభాలు దక్కాయి. అంటే దాదాపు వాళ్లకు డబుల్ ప్రాఫిట్స్ దక్కాయి.

Follow Us:
Download App:
  • android
  • ios