చిత్ర పరిశ్రమ మరో ఆణిముత్యాని కోల్పోయింది. సాహిత్యంతో సినీ కళామతల్లికి దశాబ్దాలు సేవలు చేసిన వెన్నెలకంటి అకాల మరణం పొందారు. చెన్నైలో తన నివాసంలో ఆయన కన్నుమూయడం జరిగింది. హఠాత్తుగా వెన్నెలకంటి గుండెపోటుకు గురికావడం జరిగింది. దీనితో ఆయన ఒక్కసారిగా కుప్పగూలిపోయారు. సమీప ఆసుపత్రికి ఆయనను తరలించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఆయన మరణం టాలీవుడ్ మరియు కోలీవుడ్ పరిశ్రమలను విషాదంలో ముంచివేసింది. 

గేయ, మాటల రచయితగా అపూరూపమైన సాహిత్యాన్ని వెన్నెలకంటి ప్రేక్షకులు అందించారు. ఆయన సాహిత్యం అందించిన వందల సాంగ్స్ ప్రేక్షకాదరణ పొందాయి. చెట్టు కింద ప్లీడర్ మూవీలోని అల్లిబిల్లి కలలా రావే, మహర్షి చిత్రంలోని మాటరాని మౌనమిది.. సాంగ్స్ ఆయన రాసిన ఆణిముత్యాలలో మచ్చుకు మాత్రమే. ఆధునిక కవులతో పోటీపడుతూ అద్భుత సాహిత్యాన్ని వెన్నెలకంటి అందించారు. 

సూర్య హీరోగా దర్శకుడు మురుగదాస్ తెరకెక్కించిన గజినీ... తెలుగు తమిళ భాషలో ఆల్ టైం హిట్ గా నిలిచింది. ఈ మూవీలోని అన్ని పాటలు ప్రేక్షకాదరణ పొందాయి. అయితే 'హృదయం ఎక్కడున్నది' సాంగ్స్ మాత్రం ఆ మూవీ ఆల్బమ్ లో టాప్ గా నిలిచింది. అప్పట్లో ప్రతి ఒక్కరి నోటా ఇదే పాట వినిపించేది. అలా యూత్ ని ఊపేసిన గజినీ మూవీలోని ఆ సాంగ్ ని రాసింది స్వర్గీయ వెన్నెలకంటి కావడం విశేషం. అజరామరమైన వేల పాటలను వెన్నెలకంటి అందరించారు.