బాలీవుడ్‌ సెలబ్రిటీలపై బిజీ నేత బై జయంత్‌ జే పాండ సంచనల వ్యాఖ్యలు చేశారు. కొంత మంది బాలీవుడ్‌ ప్రముఖులకు పాకిస్థాన్ ఇంటర్‌ సర్వీస్ ఇంటలిజెన్స్‌తో సంబంధాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా జమ్మూ అండ్‌ కాశ్మీర్‌లో హింసను ప్రోత్సహించేందుకు కొంత మంది బాలీవుడ్‌ ప్రముఖులు ఐఎస్‌ఐతో సంబంధాలు పెట్టుకున్నారి బై జయంత్‌ ఆరోపించారు.

అందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పిన పాండా, వారి పేర్లను మాత్రం వెల్లడించలేదు. అంతేకాదు దేశభక్తి ఉన్న బాలీవుడ్ స్టార్స్‌, ఐఎస్‌ఐతో సంబంధాలు ఉన్న వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించాడు. విచారణలో కొంత మంది ఉత్తరాది నటులకు పాకిస్థానీలు, ఎన్నారైలతో సంబంధాలు ఉన్నట్టుగా తేలిందని తెలిపారు పాండా. పాక్‌ ఐఎస్‌ఐ బాలీవుడ్‌ సంబంధాలపై ప్రత్యేక దర్యాప్తు అవసరమని ఆయన ప్రభుత్వాన్ని కోరనున్నట్టుగా తెలిపారు.

ఇటీవల నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి విషయంలో స్పందించిన ఆయన ఈ విధంగా స్పందించాడు. పాక్‌ సంబంధాలున్న నటులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పాండా కోరారు. అంతేకాదు వారిని దేశం నుంచి బహిష్కరించాలని పాండా ప్రభుత్వాన్ని కోరారు.