బిగ్‌బాస్‌ 4.. 23వ రోజులు కాస్త ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ స్వాతిని ఇంప్రెస్‌ చేయడానికి తెగ ట్రై చేస్తున్నాడు అఖిల్‌. ఇప్పటికే అఖిల్‌ .. మోనాల్‌, సుజాత, హారికలను ట్రాక్‌లో పెట్టాడు. ఇప్పుడు కొత్తగా వచ్చిన స్వాతిపై పడ్డాడు. ఇంత అందంగా ఎలా ఉండగలుగుతున్నారు. నేను తెలుసుకోవాలనుకుంటున్నా అని అడిగాడు. దీనికి అఖిల్ మనసులో కోరిక తీరుతుందో లేదో టెస్ట్ చేసి చెప్పింది స్వాతి. దాన్ని చేతిపై పెట్టుకుని గట్టిగా ఊదింది.. అది ఎగిరిపోతే మనసులో ఏం అనుకున్నామో అది జరుగుతుందట.. అక్కడే ఉంటే జరగదట. అఖిల్ మనసులో ఏం అనుకుంటే అది జరగాలి అనుకుంటూ గట్టిగా ఊదింది స్వాతి. ఆమె కనురెప్ప వెంట్రుక అక్కడ ఎరిగిపోవడంతో నువ్ అనుకున్నది అవుతుంది అంటూ అఖిల్‌కే పోప్‌ వేసింది స్వాతి. 

సోహైల్‌ ఇంటి సభ్యులకు దొంగతనం ఎలా చేయాలో చెప్పాడు. ఆ తర్వాత సోహైల్‌, అభిజిత్‌, మెహబూబ్‌ కూర్చొని జనరల్‌గా డిస్కస్‌ చేసుకుంటున్నారు. ఇంతలో మాట మాట పెరిగి అభిజిత్‌, సోహైల్‌ మధ్య వివాదం పెరిగింది. కోపాన్ని కంట్రోల్‌ చేసుకోవాలని ఇద్దరు వాదించుకున్నారు. 

ఇంతలో గంగవ్వ, అవినాష్‌, అరియానా అక్కడికి వచ్చారు. సోహైల్‌ వాధించుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు. అంతేకాదు అభిజిత్‌పై సంచలన కామెంట్‌ చేశాడు. ఆడపిల్లలతో పనిచేయించుకునే వాడివి అంటూ రెచ్చిపోయారు. దమ్ములేదు. అమ్మాయిలను పెట్టుకుని ఆడుతుంటారు. బిగ్‌బాస్‌ అభిజిత్‌కి ఫిజికల్‌ టాస్క్ లు ఇవ్వకండి.. ఆయనకు చేతకాదు అంటూ వాధిస్తూ వెళ్ళిపోయాడు. దీనికి అభిజిత్‌ రిప్లై ఇస్తూ సరే నాకు దమ్ము లేదు. నువ్వు మగాడివా.. కండలు వాడితే మగాడివి అయిపోతావా? అని వాధించాడు.

ఆ తర్వాత  సోహైల్‌.. అఖిల్‌ వద్దకు వెళ్ళి అభిజిత్‌ గురించి చాడీలు చెప్పడం ప్రారంభించాడు. అభిజిత్‌, మెహబూబ్‌ మధ్య దీనిపైనే డిస్కషన్‌ జరుగుతుంటే, అవినాష్‌.. అరియానాను లైన్‌లో పెట్టే పనిలో బిజీ అయ్యాడు. 

ఆ ఎపిసోడ్‌ పూర్తయిన తర్వాత కాయిన్స్ గేమ్‌ స్టార్ట్ అయ్యింది. కెప్టెన్స్ పోటీలకు సవాల్‌ అని కుమార్‌ సాయి కొత్త గేమ్‌ గురించి చెప్పాడు. ఎక్కువ కాయిన్స్ సాధించిన వారికి ప్రత్యేకమైన బహుమతులుంటాయని బిగ్‌బాస్‌ చెప్పారు. 

కాయిన్స్ కోసం పెద్ద యుద్ధమే జరిగింది. ఈ విషయంలో సోహైల్‌, అరియానా మధ్య పెద్ద గొడవ జరిగింది. అరియానాపై సోహైల్‌ విరుచుకుపడ్డారు. దొంగతనం చేశారని ఆరోపిస్తున్నాడు.  నేను ఆడనని తేల్చి చెప్పేశాడు సోహైల్‌. అందరు దొంగలే అంటూ ఆరోపణలు చేశాడు. 

మరోవైపు తాను దాచుకున్న కాయిన్స్ ని ఎవరో కొట్టేశారని అరియానా వాపోయింది. అది తెచ్చించేందుకు అమ్మా రాజశేఖర్‌ మాస్టర్‌ ప్రయత్నిస్తున్నారు. కానీ బిగ్‌బాస్‌ స్పందించారు. గేమ్‌ ఎవరికి వారు సొంతంగా ఆడాలని, గేమ్‌ నియమాలను మళ్ళీ చదువుకోవాలని స్పష్టం చేశారు. మరి గేమ్‌లో విన్నర్‌ ఎవరో రేపు తెలుస్తుంది. 23వ రోజు గేమ్‌ పెద్దగా కిక్‌ ఇవ్వలేదనే చెప్పాలి.