సోహైల్‌ ప్రారంభంలో పెద్దగా అలరించలేకపోయినా.. ఆ తర్వాత క్రమంగా ఊపందుకున్నాడు. మిగిలిన ఇంటి సభ్యులను మించి మంచి ఇమేజ్‌తో దూసుకెళ్తున్నారు. ఇప్పుడు ఫైనల్‌ వరకు వచ్చి ఆగిపోయాడు. ఫ్రెండ్‌ అఖిల్‌ కోసం ఫినాలే వదిలేసుకున్నాడు. ఇక ఇప్పుడు బుధవారం ఎపిసోడ్‌లో అరియానా విషయంలో ఓవర్‌గా ఫైర్‌ అయిన బ్యాడ్‌ ఇంప్రెషన్‌ వేసుకున్నాడు. అమ్మాయిపై ఆ రేంజ్‌లో అగ్రెసివ్‌గా మారి కొంపముంచుకున్నాడు. తన విషయంలో కాకుండా మోనాల్‌, హారికలా విషయంలో అరియానాతో గొడవకు దిగడం మింగుడు పడటం లేదు.  

ఇక గురువారం ఎపిసోడ్‌లో కూడా అదే విషయాన్ని సాల్వ్ చేసుకుందామని వెళ్ళి మరోసారి మోనాల్‌, హారికల విషయం గురించే ప్రస్థావించాడు. ఇది కాకుండా అరియానా టెడ్డీ బేర్‌ని కామెంట్‌ చేశాడు. నిన్న జరిగిన అరియానా చింటూ(టెడ్డీబేర్‌)పై సోహైల్‌ మరోసారి కామెంట్‌ చేశారు. అది వాష్‌రూమ్‌లో ఉండటంతో సోహైల్‌.. నిన్ను బకరా చేస్తుందని, ఎమోషన్‌ అని చెప్పి ఇలా వదిలేసిందని కామెంట్‌ చేశాడు. దాన్ని కొట్టే ప్రయత్నం చేశాడు. అందుకు మోనాల్‌ ఆపే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత కూడా దీనిపై సోహైల్‌, అఖిల్‌, మోనాల్‌ కామెంట్‌ చేసుకుంటూ నవ్వుకున్నారు. 

చివర్లో అఖిల్‌తో అరియానా వివాదం గురించి మాట్లాడే సమయంలో కూడా అయితే ఈ వారం వెళ్ళిపోతా.. హ్యాపీగా ఉండండి అంటూ వెళ్లిపోయాడు. అఖిల్‌ ఈ విషయంలో సోహైల్‌కి వార్నింగ్‌ ఇచ్చాడు. ఇవన్నీ చూస్తుంటే సోహైల్‌ చివరి నిమిషంలో రాంగ్‌రూట్‌లో వెళ్తున్నట్టు తెలుస్తుంది. తన అతి కోపం, ఆవేశమే అతన్ని టాప్‌ పొజిషన్‌ నుంచి తప్పుకునేలా చేస్తున్నాయనే కామెంట్‌ సోషల్‌ మీడియాలో వినిపించింది. మరి దీన్ని సోహైల్‌ గమనించి సరిదిద్దుకుంటాడా? లేక ఇంకా మిస్టేక్స్ చేస్తాడా? అనేది చూడాలి. ఓ స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌ ఇలా రాంగ్‌ వేలో వెళ్లడంపై ఆయన అభిమానులు కూడా ఆందోళన చెందుతున్నారు.