బిగ్ బాస్ హౌస్ కొంచెం ఎమోషనల్ గా మారింది. రెండు రోజుల్లో ఫైనల్ నేపథ్యంలో టాస్క్ లకు తెరదించి ఫైనల్ కి చేరిన ఐదుగురు సభ్యుల అందమైన బిగ్ బాస్ జర్నీని బిగ్ బాస్ వీడియో రూపంలో చూపిస్తున్నాడు. దీనిలో భాగంగా సోహైల్ యొక్క బిగ్ బాస్ హౌస్ జర్నీకి సబంధించిన వీడియో ప్లే చేయడం జరిగింది. వీడియో చూస్తూ సోహైల్ భావోద్వేగానికి గురయ్యాడు. ముఖ్యంగా తన మిత్రుడు మెహబూబ్ ని చూసి కన్నీరు పెట్టుకున్నారు. 
 
మంచి మనసు కలిగిన, కల్మషం లేని వ్యక్తిగా సోహైల్ ని బిగ్ బాస్ వర్ణించాడు. అలాగే అనేక మంది ప్రేక్షకుల హృదయాలు గెలిచినట్లు తెలియజేశాడు బిగ్ బాస్. దీనితో హౌస్ నుండి బయటికి వెళ్ళాక తనకు మంచి భవిష్యత్తు ఉన్నట్లు సోహైల్ భావించారు. ఒకప్పుడు తాను నటించిన సినిమా విడుదలైతే థియేటర్ దగ్గర కనీసం 20మంది కూడా లేరట. తన సినిమాకు తానే టికెట్స్ కొనుక్కోవాల్సిన పరిస్థితిని అప్పుడు చూశాడట సోహైల్. 
 
హౌస్ నుండి బయటికి వెళ్ళాక తన సినిమా చూడడానికి లక్షల మంది వస్తారని సోహైల్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇకపై కథ వేరే ఉంటదని , బయటికి వచ్చాక సత్తా చూపిస్తానని సోహైల్ కాన్ఫిడెంట్ గా చెప్పాడు. తనను ఇంత మందికి పరిచయం చేసిన బిగ్ బాస్ కి ధన్యవాదాలు తెలిపాడు. తనకు బిగ్ బాస్ ఒక మార్గం చూపించాడని, దారి వేశాడని సంతోషపడ్డాడు. సోహైల్ కి బిగ్ బాస్ ఆల్ ది బెస్ట్ చెప్పగా... అక్కడి నుండి బయటికి వచ్చేశాడు.