శనివారం ఎపిసోడ్ లో కొన్ని ఆసక్తికర విషయాలు చోటు చేసుకున్నాయి. హోస్ట్ నాగార్జున ఇంటి సభ్యులతో ముచ్చటించారు. ఇంటిలో సంగతులు అడిగి తెలుసుకున్నారు. ఈ వారం హౌస్ మేట్స్ ని కలవడానికి పేరెంట్స్ రావడం జరిగింది. దానిని ఉద్దేశిస్తూ ఈ వారం అంతా ఎమోషనల్ గా సాగినట్లు ఉందని నాగార్జున అడిగారు. దానికి ఇంటి సభ్యులు అవునని సమాధానం చెప్పడం జరిగింది. 

స్టేజ్ పైన కూడా కుటుంబ సభ్యులను కలిసే అవకాశం బిగ్ బాస్ కలిపించారు.  నాగార్జున అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం చెబితే, తమ సన్నిహితులను లేదా కుటుంబ సభ్యులను స్టేజ్ పైకి వచ్చేలా చేస్తానని నాగార్జున అన్నారు. ఈ ప్రక్రియలో సోహైల్ వంతు రాగా, నాగార్జున అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. 

దీనితో సోహైల్ మిత్రుడు రామారావ్, తమ్ముడు సబీల్ వేదిక పైకి రావడం జరిగింది. రామారావ్ అన్న నాకు కుటుంబ సభ్యుడి కంటే ఎక్కువ, నాకు ఇబ్బంది వస్తే ఆదుకునేది రామారావ్ అన్న అని సోహైల్ చెప్పాడు. ఐతే రామారావు సోహైల్ పై ప్రేమ చూపించే క్రమంలో అతని సీక్రెట్ బయపెట్టేశాడు. 

రాత్రి తొమ్మిదైతే అమ్మాయిల కాల్, మెస్సేజ్ లతో సోహైల్ బిజీ అయిపోతాడని చెప్పాడు. అమ్మాయిలు కలవాలని గొడవ చేస్తుంటే...హే ఉండు వస్తున్నా అంటూ అంటాడట. సోహైల్ వద్దు వద్దని వారిస్తున్నా.. రామారావు సోహైల్ నైట్ లైఫ్ గురించి బయటపెట్టేశాడు. మొత్తానికి సోహైల్ లోని ఎవరికి తెలియని కోణాన్ని మిత్రుడు రామారావ్ బయటపెట్టాడు.