బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ 14 వారం షో మరింత రక్తికట్టింది. ఇంటి సభ్యులకు ఎవరి గేమ్‌ వాళ్లు ఆడాలని బిగ్‌బాస్‌ చెప్పినా కొందరు సభ్యులు దాన్ని మిస్‌యూజ్‌ చేసుకుంటున్నారు. ఇక బుధవారం ఎపిసోడ్‌లో బోల్డ్ బ్యూటీ అరియానా, సోహైల్‌ మధ్య పెద్ద వార్‌ జరిగింది. ఇద్దరు ఒకరిపై ఒకరు రెచ్చిపోయారు. ఓపిక టాస్క్ లో అరియానా, మోనాల్‌ టాస్క్ లు కంప్లీట్‌ కాగా, సోహైల్‌ టాస్క్ ప్రారంభించాడు. ఈ సందర్భంగా సోహైల్‌పై అరియానా ప్రశ్నల వర్షం కురిపించింది. 

తన బొమ్మని(టెడ్డీబేర్‌) పాడు చేశారని, వాటర్‌లో పడేశారని మండిపడింది. తన ఎమోషన్‌తో ఆడుకున్నారని ఫైర్‌ అయ్యింది. అయినా కదలకుండా ఉన్న సోహైల్‌ సున్నా మూవ్‌మెంట్స్ తో బెస్ట్ పర్‌ఫెర్మెర్‌ అనిపించుకున్నాడు. ఆ తర్వాత అరియానాపై విరుచుకుపడ్డాడు సోహైల్‌. నువ్వు చేస్తే, మేం చేస్తే తప్పునా అని ప్రశ్నించాడు. ఆమెపై సీరియస్‌ అయ్యాడు. మోనాల్‌కి గుడ్డు కొట్టినప్పుడు ఏమీ అనిపించనిది ఇప్పుడు నీ బొమ్మను పట్టుకుంటే వచ్చిందా? అని ప్రశ్నించారు. ఆమె పైపైకి వెళ్లాడు. నేను టాస్క్ అడానని, టాస్క్ లో భాగమని చెప్పింది. టాస్క్ కూడా ఆడకూడదా? అంటూ అరియానా ప్రశ్నించింది. 

ఇలా వీరి మధ్య వివాదం పీక్‌లోకి వెళ్ళింది. తొక్క‌లో బొమ్మ కోసం నిన్ను అంత బాగా చూసుకున్న అవినాష్‌నే ఏడిపించావు. నువ్వు మాట్లాడ‌కు అని హెచ్చ‌రించాడు. సిగ్గుండాలి అంటూ‌ అరియానా మీద నోరు జారాడు. `బేబీ కేర్` టాస్క్ లో ఎంత టార్చ‌ర్ పెట్టావు అని గుర్తు చేశాడు. ఇద్ద‌రూ హోరాహోరీగా పోట్లాట‌కు దిగ‌గా నేను త‌ప్పు చేస్తే ఇక్క‌డ ఎందుకుంటాను? అంటూ అరియానా ఏడ్చేసింది. సోహైల్ అగ్రెసివ్ బిహేవియ‌ర్ నేను తీసుకోలేక‌పోతున్నా అంటూ త‌న‌ ఎమోష‌న్స్‌తో ఆడుకుంటున్నారంటూ కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో అభిజిత్‌ ఆమెని ఓదార్చాడు. మోనాల్ కూడా ఆమెను ఓదార్చేందుకు ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌గా.. నాకు రియాలిటీ అర్థ‌మైందంటూ అరియానా దండం పెట్టి అక్క‌డ నుంచి వెళ్లిపోయింది. 

బెస్ట్‌ పర్‌ఫెర్మర్‌గా నిలిచిన తన గోల్డెన్‌ మైక్‌తో నేరుగా ఆడియెన్స్ కి ఓట్లు వేయమని అప్పీలు చేసుకునే అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా తన బలహీనతలను చెప్పుకుని సోహైల్‌ బిగ్‌బాస్‌ ముందు కంటతడిపెట్టుకున్నాడు. కోపానికి గురవ్వడమే తన వీక్‌నెస్‌ అని, అది తప్ప నాకేమి వీక్‌ నెస్‌లు లేవని వేడుకున్నారు. బిగ్‌బాస్‌ స్పందిస్తూ, లక్ష్యానికి చివరి దశకు వచ్చారని, కొన్ని రోజులే మిగిలి ఉన్నాయని, పట్టదల కోల్పోకుండా, మనోధైర్యంతో ముందుకుసాగాలని, ఇలానే ఆటని కొనసాగించమని చెప్పాడు. 

అయితే ఈ వారం ప్రారంభంలో, అలాగే నాగార్జున ఇకపై ఎవరి గేమ్‌ వాళ్ళు వాడాలని స్పష్టంగా చెప్పారు. కానీ సోహైల్‌ ప్రధానంగా బుధవారంఎపిసోడ్‌లో అరియానాపై ఫైర్‌ అవ్వడం విషయంలో మోనాల్‌కి సంబంధించిన వాటినే హైలైట్‌ చేశాడు. దీంతో ఆయనపై సోషల్‌ మీడియాలో విమర్శల కామెంట్లు వస్తున్నాయి. తన గేమ్‌ పక్కన పెట్టి మోనాల్‌ కోసం ఆడటమేంటని కామెంట్‌ చేస్తున్నారు. అయితే ఓ అమ్మాయిపై అలా అగ్రెసివ్‌గా వెళ్లడాన్ని కూడా తప్పుపడుతున్నారు.

 ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో ట్రోల్‌ అవుతుంది. మరి ఇందులో ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అనేది ఆడియెన్స్ నిర్ణయిస్తారు. అయితే ఈ విషయంలో సోహైల్‌ కావాలనే అలా చేశాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తనపై ఇంప్రెషన్‌ ఆడియెన్స్ లో పెంచుకునేందుకు ఇలా చేశాడా? అనే డౌటానుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి ఏదో చేయబోయి, సోహైల్‌ అడ్డంగా బుక్కయ్యాడా? అని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో వారాంతం వరకు వెయిట్‌ చేయాల్సిందే.