బాలీవుడ్ ఖాన్స్ ఫ్యామిలీలో సైఫ్ ఆలీఖాన్ ఫ్యామిలీది ప్రత్యేక స్థానం. పటౌడీ వారసులైన సైఫ్, సోహా ఆలీఖాన్ లు ఇద్దరూ అన్నా చెళ్లెల్లు. రీసెంట్ గా సైఫ్ సతీమణి కరీనా తైమూర్ ఖాన్ కు జన్మనిచ్చింది. అప్పుడే తైమూర్ కొన్ని నెలల్లోనే ఫోటొగ్రాఫర్ల పేవరెట్ గా మారిపోయాడు. ఇప్పుడు మరో క్యూట్ బేబీ ఆ ఇంట్లో అడుగు పెట్టింది.

 

సైఫ్ అలీఖాన్ చెల్లెలు, శర్మీలా ఠాకుర్, పటౌడీ ఖాన్ దంపతుల కుమార్తె సోహా అలీఖాన్ ఈ శుక్రవారం పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కునాల్ ఖేము సోషల్ మీడియా ద్వారా స్వయంగా ప్రకటించాడు. పాప, సోహా ఆరోగ్యంగా ఉన్నారని తెలిపిన కునాల్... తన జీవితంలో అత్యంత మధుర క్షణాలను ఎంజాయ్ చేస్తున్నట్టు ట్వీట్ లో తెలిపాడు.


సోహా అలీఖాన్, కునాల్ ఖేమ్ ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. పెద్దల అంగీకారంతో పారిస్ లో వీళ్ల ఎంగేజ్ మెంట్ గ్రాండ్ గా జరిగింది. తర్వాత 2015లో ముంబయిలో వీళ్ల వివాహం కూడా భారీ ఎత్తున జరిగింది.