బ్రిటన్ లో సెటిలైన భారతీయ కుటుంబానికి చెందిన వ్యక్తి సోఫియా హయత్. టీవీ షోలతో, బిగ్ బాస్ ప్రోగ్రామ్ తో పేరు తెచ్చుకుంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. ఇటీవల ఓ నెటిజన్ "ఒక్క రాత్రికి ఇరవై లక్షలిస్తా వస్తావా" అంటూ సోఫియాకు సోషల్ మీడియా ద్వారా ప్రతిపాదించాడు. ఈ ప్రతిపాదనపై తీవ్రంగా మండిపడింది సోఫియా. చాలా ఘాటుగా సదరు వ్యక్తికి రిప్ల్ ఇచ్చింది. ఈ సంభాషణను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ కూడా చేసింది..


 

తన హాట్ ఫోటోస్ ను తరచూ షేర్ చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఒక నెటిజన్ ఈమెకు అనుచితమైన మెసేజ్ పెట్టాడు. ఇరవై లక్షలు ఇస్తాను.. తన లైంగిక అవసరాలు తీర్చాలనే ధ్వనితో మెసేజ్ చేశాడు. దీనిపై సోఫియా ఘాటుగా స్పందించింది.
 

‘ఇరవై లక్షల రూపాయలు కాదు, ఇరవై కోట్ల రూపాయలతో కూడా నన్ను కొనలేవు. ఆ డబ్బుతో మీ అమ్మను కొనగలవా? వెళ్లి ఆమెను అడుగు..’ అని అంటూ సోఫియా సదరు నెటిజన్ తిక్క కుదిర్చింది. ఒకింత బూతును జోడించి కూడా అతడికి సమాధానం ఇచ్చింది. ఆ చాట్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ ను షేర్ చేసింది సోఫియా.

 

 

Replied

A post shared by Sofia Hayat (@sofiahayat) on Mar 9, 2018 at 11:20am PST