రేణు దేశాయ్-పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వాగ్వాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో రేణు దేశాయ్ మరోసారి ఫైర్ అయ్యారు. నేను ఎలా ఉండాలో మీరు డిసైడ్ చేస్తారా అంటూ అసహనం వ్యక్తం చేశారు.
రేణు దేశాయ్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వైరం ఇప్పటిది కాదు. విడాకుల అనంతరం రేణు దేశాయ్ పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశారు. భార్య ఉండగానే మరొక మహిళతో ఎఫైర్ పెట్టుకున్నాడని ఆమె కీలక ఆరోపణలు చేశారు. పవన్ నాకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. నా సంపాదన, సేవింగ్స్ తో పిల్లల బాధ్యత నెరవేరుస్తున్నాను అన్నారు. పవన్ గౌరవానికి భంగం కలిగేలా మాట్లాడిన రేణు అంటే అభిమానుల్లో వ్యతిరేకత ఏర్పడింది.
ఇక రేణు దేశాయ్ రెండో పెళ్లి ప్రకటనతో పవన్ అభిమానులు మరింత రచ్చ చేశారు. రేణు మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి వీల్లేదని సోషల్ మీడియా వేదికగా గోల చేశారు. రేణు దేశాయ్ ని పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. రేణు దేశాయ్ సోషల్ మీడియా వేధింపులపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ హైడ్రామా కొన్నాళ్ళు నడిచింది. కారణం తెలియదు కానీ రేణు పెళ్లి ఆలోచన విరమించుకున్నారు.
అకీరా నందన్ పవన్ కళ్యాణ్ కుమారుడని సంబోధించడం రేణు దేశాయ్ కి ఇష్టం ఉండదు. పలు సందర్భాల్లో రేణు దేశాయ్ ఈ విషయంలో ఆవేశానికి గురైంది. తాజాగా పవన్ అభిమాని ఒకరు 'మా అన్న(పవన్ కళ్యాణ్ ) కొడుకు' అని అకీరాను ఉద్దేశించి కామెంట్ చేశాడు. మేడం అకీరాను దాచకండి. మా అన్న కొడుకును మాకు చూపిస్తూ ఉండండి అని రిక్వెస్ట్ చేశాడు. ఈ కామెంట్ రేణు దేశాయ్ ని ఆగ్రహానికి గురి చేసింది. అకీరా నా కొడుకు... మీ అన్న కొడుకు ఏంటి?. ఒక తల్లికే పుట్టావా? సరిగా మాట్లాడటం నేర్చుకో అని రేణు ఫైర్ అయ్యారు.

అలా మొదలైన సోషల్ మీడియా వారు కంటిన్యూ అవుతుంది. కొందరు పవన్ అభిమానులు రేణు దేశాయ్ కి ఓ సలహా ఇచ్చారు. పవన్ పాలిటిక్స్ లో ఉన్నారు. ఆయన ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి యాంటీ ఫ్యాన్స్ పవన్ అభిమానుల మాదిరి మీకు తప్పుడు సందేశాలు పంపవచ్చు. కాబట్టి మీరు ఇంస్టాగ్రామ్ అకౌంట్ సెట్టింగ్స్ మార్చుకోండి. కామెంట్స్ సెక్షన్ ఆఫ్ చేయమని సూచించారు.
పవన్ అభిమానులను సలహాలను రేణు దేశాయ్ తప్పుబట్టారు. సమాజంతో ఇదే ప్రాబ్లమ్. ఎవరి కోసమో నేను మారాలా? మీరు చెప్పినట్లు జీవించడానికి నేను ఏమి తప్పు చేశాను సలహా ఇవ్వడం చాలా ఈజీ. బాధ అనుభవించే వాళ్లకు తెలుస్తుంది.. అని కామెంట్ చేశారు. తన ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసిన సంభాషణ వైరల్ అవుతుంది.
