మహేష్ ఫ్యాన్స్ ట్రోలింగ్ పై హీరోయిన్ కామెంట్!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 10, Aug 2018, 5:37 PM IST
Sobhita Dhulipala Hits Back At Mahesh Babu Fans For Trolling Her
Highlights

ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు హీరోయిన్ శోభిత దూళిపాళ్లపై సోషల్ మీడియాలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే

ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు హీరోయిన్ శోభిత దూళిపాళ్లపై సోషల్ మీడియాలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. 'గూఢచారి' సినిమా బాగుందని ప్రశంసించిన మహేష్ ట్వీట్ కి బదులుగా శోభిత 'థాంక్యూ' అని రిప్లై చేసింది. థాంక్యూ పక్కన సర్ అని కానీ గారు అని కానీ లేదని మహేష్ ఫ్యాన్స్ ఆమెపై ఫైర్ అయ్యారు. 'థాంక్యూ' అనేది కూడా గౌరవమైన పదమే అనే విషయాన్ని మహేష్ ఫ్యాన్స్ అంగీకరించడం లేదు.

మరి ఈ విషయంపై శోభిత ఏమంటోందంటే.. 'సర్, సూపర్ స్టార్, ది గ్రేట్ అనే వాటిని నేను పేరుతో పాటు వాడని కారణంగా 'థాంక్యూ' అని చెప్పాను. అది అగౌరవంగా ఉందని చెప్పడం నన్ను కన్ఫ్యూజ్ చేస్తోంది. నాకు ఆయనపై చాలా గౌరవం ఉంది కానీ సోషల్ మీడియాలో మాత్రం సేఫ్టీ లేదు. సోషల్ మీడియాను మిస్యూజ్ చేయడం బాగాలేదు' అంటూ చెప్పుకొచ్చింది.

మరి ఇప్పుడు ఈ విషయంపై మహేష్ బాబు అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఒకప్పుడు మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చాలా సైలెంట్ గా ఉండేవారు. కానీ ఈ మధ్యకాలంలో వారు కూడా రచ్చ చేయడం మొదలుపెట్టారనే అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి.

loader