కాస్త అటు ఇటుగా ఐశ్వర్యారాయ్ పోలికలతో కనిపించే హీరోయిన్ స్నేహా ఉల్లాల్ ని బాలీవుడ్ కి పరిచయం చేశాడు హీరో సల్మాన్ ఖాన్. అక్కడ ఆమెకి సరైన అవకాశాలు రాకపోవడంతో టాలీవుడ్ కి షిఫ్ట్ అయింది. ఇక్కడ ఈ భామకి అవకాశాలు బాగానే వచ్చాయి.

మంచు మనోజ్, బాలకృష్ణ వంటి హీరోలతో కలిసి పని చేసింది. అయితే సరైన గుర్తింపును మాత్రం సంపాదించలేకపోయింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ ఇటీవల తన బికినీ ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ సంగతి పక్కన పెడితే ప్రస్తుతం ఈ భామ ప్రేమలో ఉందట. ఆమె ప్రియుడి పేరు అవీ మిట్టల్.

ఇతడు ఆల్ ఇండియా మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ చైర్మన్. స్నేహితులైన వీరిద్దరూ ప్రేమలో పడ్డట్లు, ఇరు కుటుంబ సభ్యులకు కూడా వీరి ప్రేమ సంగతి తెలుసని సమాచారం. అవీ మిట్టల్ ఫ్యామిలీ ఫంక్షన్స్ లో కూడా స్నేహా ఉల్లాల్ తరచూ కనిపిస్తుంటుంది. ప్రస్తుతం ఈ జంట మాల్దీవుల బీచ్ లో విహరిస్తున్నట్లు సమాచారం.

త్వరలోనే ఈ జంట పెళ్లి కూడా చేసుకోబోతుందని బాలీవుడ్ మీడియా కథనాలను ప్రచురిస్తోంది. కొంతకాలంగా స్నేహా ఉల్లాల్ సినిమాలకు దూరంగా ఉంటోంది. దానికి కారణం ఏమై ఉంటుందా..? అని ఆరా తీయగా.. ఆమె ఆటో ఇమ్యూన్ డిజార్దర్ అనే వ్యాధితో బాధ పడుతున్నట్లు తెలిసింది. ఒత్తిడికి గురికాకూడదని వైద్యులు చెప్పడంతో ఆమె కొంతకాలంగా సినిమాలు చేయడం లేదని సమాచారం.