ప్రాంతీయ భాషా చిత్రాల నుండి హాలీవుడ్ చిత్రాల వరకు నటీమణులు కాస్టింగ్ కౌచ్ సంఘటనలు ఎదుర్కోవడం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. అవకాశాల పేరుతో నటీనటుల లోబరుచుకునే ప్రయత్నం చాలా కాలంగా సాగుతోంది. 

ప్రాంతీయ భాషా చిత్రాల నుండి హాలీవుడ్ చిత్రాల వరకు నటీమణులు కాస్టింగ్ కౌచ్ సంఘటనలు ఎదుర్కోవడం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. అవకాశాల పేరుతో నటీనటుల లోబరుచుకునే ప్రయత్నం చాలా కాలంగా సాగుతోంది. దీనిపై హాలీవుడ్, బాలీవుడ్ లో మీటూ పేరుతో పెద్ద ఉద్యమమే సాగింది. 

టాలీవుడ్ లో కూడా అలాంటి సంఘటనలు కొన్ని వెలుగులోకి వచ్చాయి. తాజాగా హిందీ బుల్లితెర నటి స్నేహ జైన్ తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. `సాత్ నిభానా సాథియా-2` సీరియల్ తో హిందీలో స్నేహా జైన్ గుర్తింపు సొంతం చేసుకుంది. 

కెరీర్ ఆరంభంలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు కాస్టింగ్ కౌచ్ ఘటన ఎదురైందట. ఒక రోజు నాకు సౌత్ కి చెందిన ఓ డైరెక్టర్ నుంచి ఫోన్ వచ్చింది. కాలేజీ స్టూడెంట్స్ నేపథ్యంలో తెరకెక్కించే చిత్రంలో హీరోయిన్ గా ఛాన్స్ ఇస్తానని చెప్పాడు. దీనితో అతడికి నా ఫోటోస్, ఇతర వివరాలు పంపాను. 

ఆ తర్వాత రోజు మళ్ళీ ఫోన్ చేశాడు. హైదరాబాద్ కు రావాలి కోరాడు. హైదరాబాద్ కు వచ్చి రోజంతా నాతో గడపాలి. నేను ఏమడిగినా ఒకే చెప్పాలి. ఆలాగైతేనే ఛాన్స్ అని చెప్పాడు. దీనితో నేను షాక్ అయ్యాను. అలాంటివి చేయనని తేల్చి చెప్పేశాను. అయినా కూడా మరోసారి ఫోన్ చేసి ఇంకా ఆ ఆఫర్ అలాగే ఉంది. ఇలాంటివి సర్వసాధారణం. ఒకే చెబితే ఛాన్స్ నీకే అని విసిగించాడు. దీనితో గట్టిగా అరచి ఫోన్ పెట్టేశాను అని స్నేహ జైన్ చెప్పుకొచ్చింది.