ఒక సినిమా హిట్టవ్వగానే వరుసగా ఆఫర్స్ రావడం చాలా కామన్. ప్రతి సినిమా కథ బాగానే ఉందనిపిస్తుంటుంది గాని తెరపైకి వచ్చేసరికి తేడా కొట్టేస్తుంది. వేంకటాద్రి సినిమాతో అలా హిట్టందుకున్నాడో లేదో వరుసగా ఆఫర్స్ అందుకున్నాడు యువ హీరో సందీప్ కిషన్. 

కోలీవుడ్ టూ బాలీవుడ్ అని మొన్నటివరకు బాగానే ట్రై చేశాడు. అయితే కోలీవుడ్ లో ఒక హిట్టందుకున్న సందీప్ ఆ తరువాత తెలుగులో ఒక్క హిట్ కూడా అందుకోలేదు. రిజల్ట్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఇక ఇప్పుడు హీరోగా నటిస్తూ సొంతంగా ఒక సినిమాను నిర్మిస్తున్నాడు. వేంకటాద్రి బ్యానర్ లో 'నిను వీడని నీడను నేనే' అనే సినిమాతో నిర్మాతగా మారుతున్నాడు. 

కోలీవుడ్ దర్శకుడు కార్తీక్ రాజు ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక తెలుగు తమిళ్ లో ఈ డిఫరెంట్ మూవీని ఒకేసారి తెరకెక్కించి రిలీజ్ చెయ్యాలని సందీప్ ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి హీరోగా నిర్మాతగా సందీప్ ఎంతవరకు సక్సెస్ అందుకుంటాడో చూడాలి.