రామ్‌ హీరోగా నటించిన `స్కంద` మూవీ  ట్రైలర్‌ ఆద్యంతం గూస్‌బంమ్స్ గా సాగింది. అన్ని అంశాలు, అన్ని ఎమోషన్స్ మేళవింపుతో రూపొందించారని అర్థమవుతుంది. ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్‌ ప్రధానంగా సాగింది. 

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ పోతినేని హీరోగా రూపొందుతున్న చిత్రం `స్కంద`. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన మూవీ ఇది. శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. శ్రీకాంత్‌, సాయి మంజ్రేకర్‌, ఇంద్రజ, ప్రిన్స్ ముఖ్య పాత్రలు పోషించిన చిత్రమిది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన `స్కంద` మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో గెస్ట్ గా వచ్చిన బాలకృష్ణ ట్రైలర్‌ని విడుదల చేశారు. 

తాజాగా ట్రైలర్‌ ఆద్యంతం గూస్‌బంమ్స్ గా సాగింది. అన్ని అంశాలు, అన్ని ఎమోషన్స్ మేళవింపుతో రూపొందించారని అర్థమవుతుంది. ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్‌ ప్రధానంగా సాగింది. ఇందులో రామ్‌ డబుల్‌ షేడ్‌ మైండ్‌ బ్లోయింగ్‌గా ఉంది. ఇక `తియాలి, పొయాలి, తొయ్యాలి, అడ్డం వస్తే లేపాలి` అంటూ రామ్‌ చెప్పే డైలాగ్‌ అదిరిపోయింది. దీంతోపాటు కనిపంచని దేవుడిని కనిపించమని మొక్కుతావు, కనిపెంచిన దేవుడిని పట్టించుకోకపోతే ఎలా మామయ్య`, `నీకు నిద్రపోయేటప్పుడు చంపే ఆలవాటేమో నాకు నిద్ర లేపి చంపడం అలవాటు`, `కొడుకంటే కొరివిపెట్టేవాడు కాదు, పరువు నిలబెట్టేవాడు`, `షాల్తీ శాలిబండ చేరాలి`, చివరగా `పులి పులి వేటకొచ్చిందే` అంటూ వచ్చే డైలాగులు అదిరిపోయాయి. గూస్‌ బంమ్స్ తెప్పిస్తున్నాయి. 

ట్రైలర్‌ బోయపాటి మార్క్ తో సాగింది. మరో మాస్‌ మూవీతో రాబోతున్నారు. దీనికి రామ్‌ ఎనర్జీ తోడు కావడంతో మరింత హైలైట్‌ అయ్యింది. ఇక థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే అనేట్టుగా ట్రైలర్‌ ఉండటం విశేషం. సినిమాపై అంచనాలను పెంచుతుంది. `అఖండ` తర్వాత బోయపాటి మరో మాస్‌ యాక్షన్‌ సినిమాతో వస్తున్నారు. ఇందులో రామ్‌, శ్రీలీల జోడీ అదిరిపోయింది. సినిమాని శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్‌ 15న విడుదల కాబోతుంది.