ఆర్ఆర్ఆర్ తర్వాత మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న మరో పాన్ ఇండియా చిత్రం RC15(వర్కింగ్ టైటిల్). దిగ్గజ దర్శకుడు శంకర్ తొలిసారి తెలుగులో చేస్తున్న స్టైట్ మూవీ ఇది.

ఆర్ఆర్ఆర్ తర్వాత మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న మరో పాన్ ఇండియా చిత్రం RC15(వర్కింగ్ టైటిల్). దిగ్గజ దర్శకుడు శంకర్ తొలిసారి తెలుగులో చేస్తున్న స్టైట్ మూవీ ఇది. శంకర్ మ్యాజిక్ వర్కౌట్ అయితే పాన్ ఇండియా స్థాయిలో బాక్సాఫీస్ విధ్వంసం ఖాయం అని మెగా ఫాన్స్ ఆశిస్తున్నారు. 

ఈ చిత్రం నుంచి వస్తున్న లీకులు కూడా సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఇప్పటికే రాంచరణ్ డిఫెరెంట్ లుక్స్ లీక్ అయ్యాయి. ఓ సాంగ్ కూడా నెట్టింట హల్ చల్ చేసింది. తాజాగా చిత్ర యూనిట్ అఫీషియల్ అప్డేట్ ఇచ్చింది. ఈ మూవీలో విలక్షణ నటుడు ఎస్ జె సూర్య నటించబోతున్నట్లు చాలా కాలం నుంచి వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఆ న్యూస్ నిజమైంది. ఎస్ జె సూర్యకి వెల్కమ్ చెబుతూ చిత్ర యూనిట్ ఆయన లుక్ విడుదల చేసింది. 

అయితే ఇందులో ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరిచే చిన్న ట్విస్ట్ ఉంది. ఎస్ జె సూర్య ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటించబోతున్నట్లు ప్రచారం జరిగింది. కానీ రిలీజ్ చేసిన లుక్ లో సూర్య ఆఫీసర్ గెటప్ లో ఫైల్ చేతిలో పట్టుకుని సూటు, బూటుతో కనిపిస్తున్నారు. 

రాంచరణ్ కూడా ఈ చిత్రంలో సివిల్ సర్వీస్ ఆఫీసర్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. దీనితో సూర్య నటిస్తున్న రోల్ ఏంటి అనే ఉత్కంఠ పెరిగింది. సివిల్ అధికారిగానే ఉంటూ నెగిటివ్ షేడ్స్ లో నటిస్తారేమో చూడాలి. మొత్తంగా శంకర్ భారీగానే ప్లాన్ చేస్తున్నారు. 

ఈ చిత్రంలో అంజలి, శ్రీకాంత్, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీత దర్శకుడు రాంచరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ నటిస్తోంది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. 

Scroll to load tweet…