ఎస్ జె సూర్యకి 10 కోట్లు సమర్పించుకుంటున్న RRR ప్రొడ్యూసర్..టాలీవుడ్ లో హైయెస్ట్ పైడ్ విలన్ గా రికార్డ్
ఇటీవల ఎస్ జె సూర్య తమిళ, తెలుగు చిత్రాల్లో క్రేజీ విలన్ గా మారాడు. నటుడిగా విలక్షణ నటనతో, ఎంటర్టైనింగ్ డైలాగ్ డెలివరీతో మెప్పిస్తున్నాడు.

ఎస్ జె సూర్య గురించి పరిచయం అక్కర్లేదు. తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా సూర్య దర్శకుడిగా సుపరిచయమే. పవన్ కళ్యాణ్ ఖుషి చిత్రాన్ని తెరకెక్కించింది ఈ దర్శకుడే. ఇటీవల ఎస్ జె సూర్య తమిళ, తెలుగు చిత్రాల్లో క్రేజీ విలన్ గా మారాడు. నటుడిగా విలక్షణ నటనతో, ఎంటర్టైనింగ్ డైలాగ్ డెలివరీతో మెప్పిస్తున్నాడు.
మహేష్ బాబు స్పైడర్ చిత్రంలో సైకో విలన్ గా ఎస్ జె సూర్య అదరగొట్టేసిన సంగతి తెలిసిందే. శింబు మానాడు చిత్రంలో అన్నయ్య అన్నయ్య అంటూ ఎలా ఎంటర్టైన్ చేశాడో తెలిసిందే. రీసెంట్ గా సూర్య మార్క్ ఆంటోని చిత్రంలో కూడా విలన్ గా మెప్పించాడు. దీనితో ఎస్ జె సూర్యకి డిమాండ్ పెరిగిపోతోంది. ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని నటిస్తున్న వివేక్ ఆత్రేయ దర్శకత్వంలోని సరిపోదా శనివారం చిత్రంలో కూడా సూర్యనే విలన్.
ఆర్ఆర్ఆర్ నిర్మాత డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం కోసం సూర్య భారీ మొత్తంలో రెన్యుమరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఏకంగా రూ 10 కోట్ల రెమ్యునరేషన్ అడిగారట. అంతే సూర్య తన మేనేజర్ కి.. నిర్మాత దానయ్యతో రెమ్యునరేషన్ విషయంలో ఎలాంటి బేరాలు వద్దని.. ఖచ్చితంగా 10 డిమాండ్ చేయాలని సూచించాడట. డివివి దానయ్య దాదాపు 500 కోట్లతో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని నిర్మించారు.
కాబట్టి అలాంటి నిర్మాత దగ్గర పారితోషికంతో తగ్గింపు అవసరం లేదని తెలిపాడట. దీనితో దానయ్య చేసేది లేక అందుకు అంగీకరించి 10 కోట్లు సూర్యకి సమర్పించుకోబోతున్నట్లు తెలుస్తోంది. సూర్య అయితే విలన్ రోల్ కి మంచి క్రేజ్ వస్తుందని దానయ్య భావిస్తున్నారు.
ఈ రెమ్యునరేషన్ తో సూర్య టాలీవుడ్ లోనే హైయెస్ట్ పైడ్ విలన్ గా అవతరించినట్లు తెలుస్తోంది. డబుల్ ఇస్మార్ట్ చిత్రానికి సంజయ్ దత్ 6 కోట్లు తీసుకుంటున్నారు. ఎన్టీఆర్ దేవర చిత్రానికి సైఫ్ అలీ ఖాన్ కానీ,, వెంకటేష్ సైంధవ్ చిత్రానికి నవాజుద్దీన్ కానీ ఈ రేంజ్ లో పారితోషికం తీసుకోవడం లేదు.