Asianet News TeluguAsianet News Telugu

ఎట్టకేలకు OTT లోకి 'అయలాన్' తెలుగు వెర్షన్ ...ఎప్పటినుంచంటే..

అయ‌లాన్ మూవీ తెలుగు ఓటీటీ హ‌క్కుల‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ సన్ నెక్స్ట్ దక్కించుకుంది. 

Sivakarthikeyan Sci-Fi Film Ayalaan Telugu Version OTT details jsp
Author
First Published Apr 5, 2024, 6:59 AM IST


శివకార్తికేయన్ అయ‌లాన్ తెలుగు వెర్ష‌న్ జ‌న‌వ‌రి 26న థియేట‌ర్ల‌లో విడుద‌ల‌కావాల్సింది. కానీ ఫైనాన్షియ‌ల్ సమస్యల వ‌ల్ల లాస్ట్ మినిట్ లో  ఈ మూవీ రిలీజ్ కాన్సిల్  అయ్యింది. తెలుగు వెర్ష‌న్‌కు సంబంధించి అయ‌లాన్ వీఎఫ్ఎక్స్‌, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌నుషారుఖ్‌ఖాన్‌కు చెందిన రెడ్‌ఛీల్లీస్ వీఎఫ్ఎక్స్ కంపెనీ అందించిన‌ట్లు తెలిసింది. ఈ గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్‌కు వ‌ర్క్‌కు సంబంధించి ప్రొడ్యూస‌ర్స్‌ భారీగా షారుఖ్ కంపెనీకి బ‌కాయిప‌డిన‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. అందుకే తెలుగు రిలీజ్‌ను రెడ్ ఛిల్లీస్ కంపెనీ అడ్డుకున్న‌ట్లు వార్త‌లొచ్చాయి. 

ఇక థియేట‌ర్ల‌లో రిలీజైన సినిమాల‌నే ఓటీటీలో రిలీజ్ చేయాల‌నే ఒప్పందాన్నిడిజిట‌ల్ స్ట్రీమింగ్ సంస్థ‌లు పాటిస్తున్నాయి. ఆ ఒప్పందం కార‌ణంగానే అయ‌లాన్ తెలుగు వెర్ష‌న్ ఓటీటీలో రిలీజ్ కాలేద‌ు.  దాంతో అయ‌లాన్ త‌మిళ వెర్ష‌న్ మాత్ర‌మే స‌న్ నెక్స్ట్‌లో రిలీజైంది. తెలుగు వెర్ష‌న్‌ను రిలీజ్ చేయ‌లేదు. మొదట రెండు భాష‌ల్లో విడుద‌ల కాబోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. కానీ కేవ‌లం త‌మిళ వెర్ష‌న్‌ను మాత్ర‌మే ఓటీటీ ఆడియెన్స్ ముందుకు తీసుకొచ్చారు. తెలుగు వెర్ష‌న్‌కు సంబంధించి ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. ఇంతకాలానికి తెలుగు వెర్షన్ ఓటిటిలో వస్తోంది.

అయ‌లాన్ మూవీ తెలుగు ఓటీటీ హ‌క్కుల‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ సన్ నెక్స్ట్ దక్కించుకుంది. ఏప్రిల్ 19న అయలాన్ సినిమా స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. త్వరలోనే  అఫీషియల్ ప్రకటన  ఇవ్వనున్నారు మేకర్స్.   ఈ మూవీ తెలుగు వర్షన్ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ సినిమాలో శివకార్తికేయన్ కు జోడిగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది.

స్టోరీ లైన్

ఒక ఏలియన్ భూమి మీదకు వస్తుంది. అది తమీజ్(శివకార్తికేయన్) అనే యువకుడిని కలుస్తుంది. తమీజ్ అతని మిత్రులు టైసన్(యోగి బాబు), సుగిర్తరాజా(కరుణాకరన్) కలిసి ఏలియన్ కు టట్టూ అని పేరు పెడతారు. టట్టూతో యోగిబాబు, కరుణాకరన్ చాలానే తిప్పలు పడతారు. ఆ తర్వాత టట్టూ కొందరి చెడు వ్యక్తుల చెరలో చిక్కుతుంది. అక్కడి నుంచి హీరో అతని మిత్రులు టట్టూని ఎలా కాపాడారు? అసలు టట్టూ భూమి మీదకు ఎందుకు వచ్చాడు? భూమిని ఏ ప్రమాదం నుంచి కాపాడేందుకు టట్టూ ప్రయత్నిస్తాడు? టట్టూ తిరిగి తన ప్లానెట్ కి క్షేమంగా వెళ్లాడా? అనే ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కావాలంటే మీరు  అయలాన్ సినిమా చూడాల్సిందే. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios