Asianet News TeluguAsianet News Telugu

ఇంకోసారి ఏలియన్ అంటే మనిషిగా మారిపోతా, కేక పెట్టిస్తున్న ట్రైలర్.. సంక్రాంతి బరిలో శివకార్తికేయన్ మూవీ

హీరో శివకార్తికేయన్ తన చిత్రంతో సంక్రాంతి బరిలో నిలిచాడు. ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'అయలాన్' తెలుగు ట్రైలర్ తాజాగా విడుదలయింది. సామాన్యుడితో ఏలియన్ దోస్తీ చేస్తే ఎలా ఉంటుంది అనే పాయింట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

Sivakarthikeyan Ayalaan movie Telugu Trailer is here dtr
Author
First Published Jan 6, 2024, 2:19 PM IST

సంక్రాంతికి తెలుగు సినిమాలకే థియేటర్లు దొరక్క నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. 5 సినిమాలు బరిలో ఉంటే చర్చల ద్వారా ఒప్పించి రవితేజ ఈగల్ చిత్రాన్ని వెనక్కి వెళ్లేలా చేశారు. పరిస్థితి ఈ విధంగా ఉంటే ఇప్పుడు తమిళ హీరో శివకార్తికేయన్ తన చిత్రంతో సంక్రాంతి బరిలో నిలిచాడు. 

ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'అయలాన్' తెలుగు ట్రైలర్ తాజాగా విడుదలయింది. సామాన్యుడితో ఏలియన్ దోస్తీ చేస్తే ఎలా ఉంటుంది అనే పాయింట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆర్ రవికుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ శివకార్తికేయన్ కి జోడిగా నటిస్తోంది. 

మానవులు ఉన్న భూమిని కాపాడుకోలేక నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనే పాయింట్ ని దర్శకుడు ఈ చిత్రంలో చూపించబోతున్నారు. అలాగే భూమి అన్ని జీవరాశులకు సొంతం అనే అంశాన్ని కూడా లేవనెత్తారు. అయితే భూమికి ముప్పు వాటిల్లినప్పుడు ఒక ఏలియన్.. సామాన్యుడైన శివకార్తికేయన్ తో జత కట్టి ఎలా కాపాడింది అనేది ట్రైలర్ లో చూపించారు. 

అయలాన్ ట్రైలర్ లో విజువల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. గ్రాఫిక్స్ కి పెద్ద ప్రాధాన్యతే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే శివకార్తికేయన్ తో కలసి ఏలియన్ ఎలాంటి విధ్వంసం సృష్టించింది అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే. జనవరి 12న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. 

ఏలియన్ తో వచ్చే ఫన్నీ సీన్స్ కూడా బాగా వర్కౌట్ అయినట్లు ఉన్నాయి. సాధారణంగా ఏలియన్స్ అమెరికా మీదే కదా దాడి చేస్తా.. మా దేశానికీ వచ్చారు ఏంట్రా అంటూ శివకార్తికేయన్ చెప్పే డైలాగ్ ఫన్నీగా ఉంది. అలాగే యోగి బాబు, ఏలియన్ మధ్య కూడా కామెడీ సీన్స్ ఉన్నాయి. యోగిబాబు రేయ్ ఏలియన్ అని తిడుతుంటే.. ఏలియన్ తిరిగి రెచ్చిపోతుంది. ఎవర్రా ఏలియన్.. నువ్వు ఏలియన్, నీ అబ్బ ఏలియన్, నీ అమ్మ ఏలియన్.. ఇంకోసారి ఏలియన్ అంటే మనిషిగా మారిపోతా అని చెప్పడం నవ్వులు పూయిస్తోంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios