టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండకి తెలుగుతో పాటు తమిళంలో కూడా తన మార్కెట్ పెంచుకోవాలని చూస్తున్నాడు. ఈ క్రమంలో బైలింగ్యువల్ చిత్రాల్లో నటిస్తున్నాడు. తాజాగా విజయ్ తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో బహు భాషా సినిమా చేస్తున్నట్లుగా అనౌన్స్ చేశాడు.

తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఒకేసారి రూపొందిస్తోన్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాకి 'హీరో' అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. టైటిల్ అన్ని భాషలకు కామన్ గా ఉంటుందని భావించారు.

అయితే ఇప్పుడు తమిళంలో అదే టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కింది. శివ కార్తికేయన్ హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది. దీనికి 'హీరో' అనే టైటిల్ కన్ఫర్మ్ చేసారు. షూటింగ్ కూడా ముందుగానే మొదలైంది కాబట్టి ఈ సినిమానే ముందుగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

చిత్ర యూనిట్ కూడా తమిళ నిర్మాతల మండలిలో టైటిల్ తాము రిజిస్టర్ చేసుకున్నట్లుగా సాక్ష్యాలను బయటపెట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ దేవరకొండ ఏం చేస్తాడో చూడాలి!