'మా' ఎన్నికల వివాదం సద్దుమణగడం లేదు. ఎన్నికలు పూర్తై నరేష్ ప్యానెల్ గెలిచినప్పటి నుండి వివాదం మరింత ముదురుతోంది. నరేష్ ప్రమాణస్వీకారానికి శివాజీరాజా అడ్డుపడుతున్నట్లు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. అయితే తాజాగా శివాజీరాజా ఈ విషయంపై మండిపడ్డారు.

నరేష్ ప్రమాణస్వీకారాన్ని అడ్డుకోలేదని అన్నారు. రూల్స్ ప్రకారం ఈ నెలాఖరు వరకు టైం ఉందని మాత్రమే చెప్పానన్నారు. 'మా' ఎన్నికల్లో నాగబాబు ప్రత్యక్షంగా నరేష్ కి సపోర్ట్ ఇస్తున్నారని అన్నారు. కొత్తవారికి అవకాశమివ్వాలనే తాను నరేష్ ప్యానెల్ కి సపోర్ట్ ఇస్తున్నట్లు ఆయన 'మా' ఎన్నికలకు ముందు ప్రకటించారు.

అయితే ఇప్పుడు శివాజీ రాజా నాగబాబుకి త్వరలోనే నాగబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని అన్నారు. ఓల్దేజ్ హోం కట్టడం తన కల అని, ఇప్పుడు దానిపై నీళ్లు జల్లారని వాపోయారు.

ఓల్దేజ్ హోం కట్టిస్తే.. కాశీ నుండి నీళ్లు తెప్పించి కాళ్లు కడుగుతానని సవాల్ విసిరారు. కష్టపడి తాను ఈ స్థాయికి వచ్చానని శివాజీరాజా అన్నారు. మెగాస్టార్ రుణం మాత్రం తన  జీవితంలో తీర్చుకోలేనని అన్నారు.