శివరాజ్ కుమార్ ‘ఘోస్ట్’ తెలుగు వర్షన్ రిలీజ్ డేట్ ఫిక్స్
తెలుగులో కీడా కోలా, పొలిమేర 2 మూవీస్ రిలీజ్ కానున్నాయి. వాటితో పాటు తెలుగు ఆడియన్స్ ముందుకి రానున్న ఘోస్ట్ మూవీ ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి.

రీసెంట్ గా కన్నడ చక్రవర్తి డాక్టర్ శివరాజ్ కుమార్(Shivarajkumar)ఘోస్ట్(Ghost)తో ముందుకు వచ్చారు. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 19న కన్నడంలో రిలీజైంది. అదే రోజు తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ థియేటర్స్ దొరక్క ఆపారు. దసరా సినిమాలు వేడి తగ్గటంతో ఈ సినిమా తెలుగు వెర్షన్ రిలీజ్ చేస్తున్నారు. ఈ మేరకు కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ అవుతూ పోస్టర్ వదిలారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ కి కన్నడ బ్లాక్ బస్టర్ బీర్బల్ చిత్ర దర్శకుడు శ్రీని దర్శకత్వం వహించగా, ప్రముఖ రాజకీయ నాయకుడు, నిర్మాత సందేశ్ నాగరాజ్ తన సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
ఈ చిత్రం తెలుగు వర్షన్ ని నవంబర్ 4న విడుదల చేయనున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. వచ్చే వారంలో తెలుగులో కీడా కోలా, పొలిమేర 2 మూవీస్ రిలీజ్ కానున్నాయి. వాటితో పాటు తెలుగు ఆడియన్స్ ముందుకి రానున్న ఘోస్ట్ మూవీ ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి. జయరామ్, అనుపమ్ ఖేర్, ప్రశాంత్ నారాయణన్, అర్చన జోయిస్, సత్య ప్రకాష్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీని సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సందేశ్ గ్రాండ్ గా నిర్మించారు. కాగా ఈ మూవీకి అర్జున్ జన్య స్వరాలు సమకూర్చారు.
కన్నడ ఇండస్ట్రీలో శివరాజ్ కుమార్ నటించిన ఎన్నో సినిమాలు సంచలన విజయాలను సొంతం చేసుకున్నాయి. అయితే ఈ సినిమా ఆ స్దాయిలో వర్కవుట్ కాలేదు. ఫస్ట్ డే కలెక్షన్లు కేవలం 4 కోట్ల రూపాయలు అని ఆ మొత్తం కూడా గ్రాస్ కలెక్షన్లు అని తెలుస్తోంది.సెకండ్ డే కలెక్షన్లు కోటిన్నర రూపాయలకు అటూఇటుగా ఉన్నాయని సమాచారం. ఆ తర్వాత బాగా డ్రాప్ అయ్యింది. శివరాజ్ కుమార్ (Ghost) ఘోస్ట్ మూవీ కలెక్షన్ల లెక్కలు తెలిసి నెటిజన్లు షాక్ అయ్యారు. ఈ సినిమా కలెక్షన్లు ఇంత తక్కువా అని నెటిజన్లు అశ్చర్యపోయారు. అయితే ఘోస్ట్ సినిమాకు పోటీగా ఎక్కువ సంఖ్యలో సినిమాలు కర్ణాటకలో విడుదల కావడం వల్లే ఈ సినిమాకు కలెక్షన్లు తగ్గాయని అన్నారు. మరి తెలుగులో ఏ మేరకు ఆడుతుందో చూడాలి.
ఆ మధ్యన ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. తెలుగు ట్రైలర్‌ను దర్శక ధీరుడు రాజమౌళి(S. S. Rajamouli) రిలీజ్ చేసి శివన్నకు కంగ్రాట్స్.. ఆల్ ది బెస్ట్ తెలిపారు. ట్రైలర్ లో విజువల్స్, డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయి. మరీ ముఖ్యంగా శివన్న డైలాగ్స్ గూస్ బంప్స్ వచ్చేలా ఉన్నాయి. యుద్దం మానవ ప్రపంచానికి మానని ఓ గాయం..ఇలాంటి యుద్దాల వల్ల సామ్రాజ్య స్థాపన కంటే కూడా.. అవి చేసే నష్టాలే ఎక్కువ..సామ్రాజ్యాలను నిర్మించిన వాడిని చరిత్ర ఎన్నో సార్లు మరిచిపోయి ఉండొచ్చు..కానీ విధ్వంసం సృష్టించే నా లాంటి వాడ్ని మాత్రం చరిత్ర ఎప్పటికీ మరిచిపోదు..అంటూ శివ రాజ్ కుమార్ చెప్పిన డైలాగ్ వావ్ అనేలా ఉంది.