టాలీవుడ్ లో ఈ మధ్య వరుసగా రిలీజ్ అయిన సినిమాల్లో కొన్ని సత్తా చూపాయి .. మరికొన్ని బోల్తా కొట్టాయి. ఇక సక్సెస్ సాధించిన సినిమాల్లో సీతారామం ఒకటి. ఈసినిమా సౌత్ లో సత్తా చాటి.. నార్త్ లో అడుగు పెట్టబోతోంది. 

మలయాళ యంగ్ అండ్ హ్యాండ్సమ్ హీరో .. దుల్కర్ సల్మాన్ .. మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా .. నటించిన సినిమా సీతారామం. రష్మిక మందన్న కీలకపాత్రలో నటించిన ఈసినిమా ఈ నెల 5వ తేదీన రిలీజ్ అయ్యింది. అశ్వనీదత్ నిర్మించిన ఈ సినిమాకి హను రాఘవపూడి దర్శకత్వం వహించాడు. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ భాషల్లో ఒకే రోజున ఈ సినిమా విడుదలైంది. 

రిలీజ్ అయిన రోజు నుంచీ.. ఇప్పటి వరకూ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న సీతారామంకు ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ లభించింది. ఈ మధ్య కాలంలో ఇలాంటి ప్రేమ కథ మరొకటి రాలేదు. దాంతో ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మూవీగా మంచి మార్కులు కొట్టేసింది సినిమా. తమిళ .. మలయాళ భాషల్లో కూడా చెప్పుకోదగిన వసూళ్లను రాబట్టింది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు బాలీవుడ్ ఆడియన్స్ ను పలకరించడానికి రెడీ అవుతోంది.

సీతారామం సినిమాను సెప్టెంబర్ 2న నార్త్ లో రిలీజ్ చేయడానిక రెడీ అవుతున్నారు మేకర్స్. ఈ సినిమా హిందీ వెర్షన్ రిలీజ్ కు సబంధించి మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. బాలీవుడ్ ప్రేక్షకులు ఈ తరహా ప్రేమకథలను ఎక్కువగా ఇష్టపడతారు. అంతే కాదు ఈ సినిమాలో హీరోయిన్ మృణాల్ ఠాకూరత్ బాలీవుడ్ కు చెందిన హీరోయిన్. అంతే కాదు దుల్కర్ .. రష్మిక కూడా వారికి బాగా తెలుసు. అందువలన మరింత త్వరగా ఈ కథ వాళ్లకి కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దాంతో బాలీవుడ్ బాక్సాఫీస్ రిజల్ట్ పై కూడా చానా నమ్మకంతో ఉన్నారు మేకర్స్.