సూపర్ స్టార్ మహేష్ బాబుకి సంబంధించిన ఏఎంబీ మాల్ లో ఆయన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. నిజానికి సింగపూర్ టుస్సాడ్స్ లోనే ఈ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించాలని అనుకున్నారు.

కానీ మహేష్ కి కాల్షీట్స్ ఇబ్బంది తలెత్తడంతో హైదరాబాద్ లోనే ఆవిష్కరించి ఈరోజు మొత్తం సందర్శకుల కోసం ఇక్కడే ఉంచుతున్నారు. విగ్రహం ఎంతో అందంగా ఉందని, అధ్బుతంగా తీర్చిదిద్దారని మహేష్ అన్నారు. ఈ విగ్రహాన్ని వీక్షించడానికి అభిమానులు ఏఎంబీ మాల్ కి క్యూ కడుతున్నారు.

ఇది ఇలా ఉండగా.. విగ్రహం చూడడానికి మహేష్ కూతురు సితార కూడా మాల్ కి విచ్చేసింది. విగ్రహం వైపు చూస్తూ ఆశ్చర్యపోయింది. చాలా సేపటి వరకు నిలబడి విగ్రహం వంక చూస్తూనే ఉంది.

అచ్చం నాన్నలానే ఉన్నాడనుకుంటూ ఓ వైపు తన డాడ్ ను మరోవైపు విగ్రహాన్ని చూస్తూ నిల్చుంది. బ్లాక్ సూట్ లో ఉన్న మహేష్ మైనపు విగ్రహాన్ని ఎంతో అందంగా రూపొందించారు టుస్సాడ్ శిల్పులు.