హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కన్నీరు పెట్టింది. ఆ విషయయంలో ఎంతో బాధపడ్డానంటోంది. దాంతో ఆమె అభిమానులు కంగారు పడుతున్నారు. ఏమైందంటూ.. ఆరా తీస్తున్నారు. 

సీతారామం సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది మృణాల్ ఠాకూర్. మొదటి సినిమాతోనే తెలుగువారి మనసు దోచిన ఈ బ్యూటీ. సీతారామం సినిమాతో వరుస ఆఫర్లు కొట్టేస్తోంది. అంతే కాదు టాలీవుడ్ లో సెటిల్ అవ్వడానికి.. హైదరాబాద్ లో ఇల్లు కూడా కొనేసిందట చిన్నది. ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్ ను బ్యాలెన్స్ చేస్తూ.. సినిమాలు చేస్తున్న ఈబ్యూటీ.. త్వరలో టాలీవుడ్ నుంచే పాన్ ఇండియా లెవల్లో సినిమాలు చేయాలని చూస్తోందట. 

ఇక మృణాల్ ఠాకూర్ సీతారమం హిట్ పడగానే.. ఆమె ఇమేజ్ అమాంతం పైకి లేచింది. దాంతో ఆమె సోషల్ మీడియా పాలోవర్స్ కూడా పెరిగిపోయారు. ఎప్పటికప్పుడు ఆమె ఇస్తున్న అప్ డేట్స్ చూస్తూ.. రకరకాల కామెంట్లు చేస్తుంటారు. ఈక్రమంలో మృణాల్ సడన్ గా ఆమె కన్నీళ్లు పెట్టుకున్న ఫొటోని ఇన్ స్టా స్టోరీలో చూసి అభిమానులు కాస్త కంగారు పడ్డారు. అసలేమైంది? అంటూ ఆరాలు తీస్తున్నారు. 

అసలు మృణాల్ ఏడవడానికి కారణమేంటా అని నెట్టింట్లో తెగ డిస్కషన్ చేసుకుంటున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే.. ? మృణాల్ తన పాత ఫోటోను శేర్ చేసింది. తన మనసు బాలేక.. బాధపడుతున్న టైమ్ లో తీసిన కన్నీటి ఫోటోను శేర్ చేసింది. సినిమా యాక్టర్స్ అనగానే అందరికి లగ్జరీ లైఫ్ గుర్తొస్తుంది. కాస్ట్లీ లైఫ్ కనిపిస్తుంది. కానివాళ్ల జీవితంలో బాధల గురించి ఎవరూ పట్టించుకోరు. వాళ్లంతట వాళ్ళు సోషల్ మీడియాలో చెపితే తప్ప.. వారి బాధల గురించి అవసరం లేదు అన్నట్టు ఉంటారు.అంతే కాదు విషయం తెలియకుండా.. కామెంట్లతో గుచ్చమంటే మాత్రం రెడీగా ఉంటారు కొంత మంది నెటిజన్లు. 

తాజాగా అలాంటి పరిస్థితి తన లైఫ్ లో ఎదురైందని హీరోయిన్ మృణాల్ చెప్పుకొచ్చింది. అప్పుడు తీసుకున్న ఫొటోనే ఇది అంటూ క్యాప్షన్ పెట్టి మరీ పోస్ట్ చేసింది. చాలా లోగా అంటే బాగా డిప్రెషన్ లో ఉన్న టైంలో తీసుకున్న పిక్ ఇది అని, ఇప్పుడైతే బాగానే ఉన్నానంటూ సీతారామం బ్యూటీ చెప్పుకొచ్చింది.నిన్న కష్టంగా గడిచింది. ఈ రోజు మాత్రం నేను స్ట్రాంగ్ గా, హ్యాపీగా ఉన్నాను. ప్రతి ఒక్కరి జీవితంలోనూ కొన్ని పేజీలు ఉంటాయి. వాటిని పెద్దగా చెప్పుకోరు. కానీ నేను మాత్రం వాటిని బయటకు చెప్పాలనుకుంటున్నాను అన్నారు మృనాల్. 

ఎందుకు చెప్పాలి అనుకుంటున్నానంటే.. వీటిని చూసి వేరే ఎవరైనా నేర్చుకోవచ్చు కదా. అమాయకంగా ఉండటం తప్పేం కాదు అని హీరోయిన్ మృణాల్ తన స్టోరీకి క్యాప్షన్ పెట్టింది. ప్రస్తుతం మృణాల్ ఫోస్ట్ వైరల్ అవుతోంది. ఇంత టాలెంట్ ఉన్న ఈ బ్యూటీ మనసులో ఇంత బాధ కూడా ఉందా..? అని ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. ఇక వరుస సినిమా ఆఫర్లు సాధిస్తున్న మృణాల్.. టాలీవుడ్ లోనానీ సరసన 30వ సినిమాలో నటిస్తోంది. అటు బాలీవుడ్ లో ఆమె హీరోయిన్ గా నటించిన హిందీ సినిమా గుమ్రా ఏప్రిల్ 7న రిలీజ్ కు రెడీ అవుతోంది.