ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తన తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ ని హీరోగా పరిచయం చేసి కమర్శియర్ హీరోగా నిలబెట్టడానికి చాలా ప్రయత్నాలే చేస్తున్నాడు. స్టార్ డైరెక్టర్స్, స్టార్ హీరోయిన్స్ కి కోట్లు చెల్లించి బెల్లకొండ శ్రీనివాస్ సినిమా కోసం ఒప్పించేవాడు.

బెల్లంకొండ మార్కెట్ ని పెంచడం కోసమే ఇలా చేసేవారు. అయితే ఇప్పుడు ఆ మార్కెట్ ని మరింత కిందకి పడిపోయేలా చేస్తున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఈ మధ్యకాలంలో  అతడికి వరుసగా ఫ్లాప్ లు వస్తున్నాయి. 'కవచం' పెద్ద ఫ్లాప్ కావడంతో కమర్షియల్ కథలకు కాస్త దూరంగా జరిగి 'సీత' సినిమాను ఓకే చేశాడు.

అది కూడా బెల్లంకొండని కాపాడలేకపోయింది. అతడి సినిమాలకు తొలిరోజు వచ్చే కలెక్షన్స్ 'సీత' సినిమాకు మూడు రోజుల్లో వచ్చాయి. దీన్ని బట్టి చూస్తుంటే అతడి సినిమాలకు ఆడియన్స్ లో ఆసక్తి ఎంతగా తగ్గిందో తెలుస్తోంది. కాజల్ లాంటి స్టార్ హీరోయిన్, తేజ లాంటి డైరెక్టర్ ఉన్నప్పటికీ ఈ  సినిమాకు కనీసపు ఓపెనింగ్స్ కూడా రాలేదు.

మొదటి వీకెండ్ కి ఈ సినిమాకి నాలుగు కోట్ల షేర్ కూడా రాలేదు. దాదాపు పదమూడు కోట్లు వసూళ్లు రాబట్టాల్సిన ఈ సినిమా సగానికి పైగా మొత్తాన్ని పోగొట్టుకోనుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా ఎఫెక్ట్ బెల్లంకొండ తదుపరి సినిమాల మార్కెట్ పై పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.