కాజల్ అగర్వాల్ - బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా సీత. తేజ దర్శకత్వం వహించిన ఈ డిఫరెంట్ డ్రామా ఫిల్మ్  గత వారం గ్రాండ్ గా రిలీజయింది. మిక్సిడ్ టాక్ తెచ్చుకోవడంతో బాక్స్ ఆఫీస్ వనంలో సీతకు ఎంతవరకు లాభాలు అందుతాయనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 

మొదటి మూడు రోజుల్లో ఈ సినిమా 4.2 కోట్ల షేర్స్ తో పరవాలేధనిపించినప్పటికీ సెకండ్ వీక్ నుంచి అదే రేంజ్ లో కలెక్షన్స్ కొనసాగుతాయా అనేది అనుమానమే. ఈ సినిమాకు చిత్ర యూనిట్ గత కొన్ని రోజులుగా గ్యాప్ లేకుండా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. వీకెండ్స్ లో ఆ ప్రచారాలు బాగానే ఉపయోగపడినప్పటికీ ఇప్పుడు ఎలా టార్గెట్ ను రీచ్ అవుతుందో చూడాలి. 

అసలైతే ఈ సినిమా 15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో అందరికి షాకిచ్చింది. కాజల్ గ్లామర్ అలాగే తేజ డైరక్షన్ లో సినిమా తెరకెక్కడంతో ఓ వర్గం వారు ఎక్కువగా ఆకర్షితులయ్యారు. ఇక ఈ వీక్ లో వరుసగా 5 సినిమాలు రిలీజ్ కానున్నాయి. సూర్య NGKపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మరి సీత ఈ ఫైట్ లో ఎంతవరకు లాభాల్ని అందుకుంటుందో చూడాలి.