ప్రతిభకు పట్టంకట్టే పురస్కారాలు ఆలస్యం అవుతున్నట్లు ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తోన్న విమర్శ. రీసెంట్ గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ శ్రీ అవార్డులు పలువురి సినీ ప్రముఖులను కూడా వరించింది. అవార్డు అందుకున్న సినీ ప్రముఖలకు అభిమానులు బెస్ట్ విషెష్ అందిస్తున్నారు. అయితే ఈ పురస్కారాలు ఆలస్యం అయినట్లు సిరివెన్నెల అభిమానుల నుంచి వస్తోన్న మాట. 

35 ఏళ్ల నుంచి తన పెన్నుతో నిజాల్ని భావోద్వేగాల్ని ప్రేమను.. ఇంకా ఎన్నో భావాలకు పాటతో అర్ధం చెప్పిన సిరివెన్నలకు ఇప్పటికైనా పద్మశ్రీ వరించినందుకు చాలా సంతోషంగా ఉందని తెలుగు ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రీ ని ప్రత్యేకంగా కలుసుకున్న త్రివిక్రమ్ తన విషెష్ ను అందించారు  ఇక మరో ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవాకి పద్మశ్రీ దక్కింది. 

అలాగే బాలీవుడ్‌ నటుడు మనోజ్‌ బాజ్‌పేయి, గాయకులు శంకర్‌ మహదేవన్‌లకు కూడా ఈ పురస్కారం లభించింది. ఇక మలయాళ నటుడు మోహన్‌ లాల్‌ ను ‘పద్మభూషణ్‌’ వారించగా ఆయన అభిమానులు కూడా ఈ పురస్కారం చాలా ఆలస్యంగా వచ్చిందని సోషల్ మీడియా ద్వారా వివరణ ఇస్తున్నారు.