అనంతరం ఫైనలిస్ట్ లైన సన్నీ, మానస్, శ్రీరామ్, సిరి, షణ్ముఖ్‌లకు సౌండ్‌లను బట్టి ఆ వాయిస్ దేనిదో గుర్తుపట్టి స్లేట్‌పై రాయాల్సి ఉంటుంది. గతంలో జరిగిన గేమ్‌నే సరదాగా మళ్లీ చేయించారు బిగ్‌బాస్.
బిగ్‌బాస్ ఐదో సీజన్ ముగింపు దశకు చేరుకునే కొద్ది మరింత ఆసక్తికరంగా, రక్తికట్టించేలా సాగుతుంది. బెస్ట్ ఎంటర్‌టైనర్‌గా నిలిచిన సన్నీ, ఆయనకు బద్ద శత్రువైన సిరికి మధ్య వార్ ఇప్పట్లో ఆగేలా లేదు. మరోసారి వీరిద్దరి మధ్య చిచ్చు రేగింది. అది బిగ్‌బాస్ హౌజ్‌లో మంటలు పుట్టించింది. ఇద్దరి మధ్య గొడవ పీక్‌లోకి వెళ్లడం విశేషం. బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ 102వ రోజు హౌజ్‌లో నవ్వులు, వార్‌లతో సాగింది.
మొదట పలు సరదా టాస్క్ లిచ్చాడు బిగ్‌బాస్. అందులో భాగంగా ఇంటి సభ్యుల మధ్యపలు పిచ్చాపాటి డిస్కషన్ జరిగింది. అనంతరం స్విమ్మింగ్ పూల్‌లో టీషర్ట్ టాస్క్ ని మరోసారి చేయించారు బిగ్‌బాస్. ఇందులో సన్నీ సంచాలకుడిగా ఉండగా, మానస్, షణ్ముఖ్ గేమ్‌లో పార్టిసిపేట్ చేశారు. టీషర్ట్ లు సరిగ్గా ధరించి స్విమ్మింగ్ పూల్‌లో అట్నుంచి ఇటు, ఇట్నుంచి అటు వెళ్లాల్సి ఉంటుంది. ఇందులో మానస్, షణ్ముఖ్ హోరాహోరిగా ఆడారు. మంచి ప్రదర్శన ఇచ్చారు. అయితే ఇందులో విన్నర్ సంచాలకే అని సంచాలకుడిగా ఉన్న సన్నీ చెప్పడం నవ్వులు పూయించింది. మంచికామెడీ షోగా మారింది.
అనంతరం ఫైనలిస్ట్ లైన సన్నీ, మానస్, శ్రీరామ్, సిరి, షణ్ముఖ్‌లకు సౌండ్‌లను బట్టి ఆ వాయిస్ దేనిదో గుర్తుపట్టి స్లేట్‌పై రాయాల్సి ఉంటుంది. గతంలో జరిగిన గేమ్‌నే సరదాగా మళ్లీ చేయించారు బిగ్‌బాస్. కామెడీ తరహాలో సాగిన ఈ టాస్క్ లో ఇంటిసభ్యులు రాసిన పేర్లు మరింతగా కామెడీ పంచాయి. వాళ్లు తప్పుగా రాయడంతో బిగ్‌బాస్ వాళ్లు రాసిన దానికి, నిజమైన సౌండ్ చేసిన వాహనం గానీ,పక్షులు, జంతువులకు ఉన్న తేడా ఏంటో చెప్పాలని ప్రశ్నించగా, కొన్ని స్పెల్లింగ్స్ ని అడగ్గా సన్నీ, మానస్, సిరి బిత్తర మోహం వేయడం మరింతగా కామెడీ పండించింది.
మరోవైపు సన్నీ, మానస్, శ్రీరామ్ బిగ్‌బాస్ హౌజ్ గోడలు ఎక్కే ప్రయత్నం చేశారు. దీంతో బిగ్‌బాస్ సీరియస్ అయ్యాడు. చివరి రోజుల్లో ఇలాంటి పనులు చేయకూడదని, వస్తువులను పాడు చేయకూడదని, గాయాలు తగిలే పనులు చేయకూడదని హెచ్చరించారు. ఫైనల్‌కి వెళ్లే దశలో ఇలాంటి పనులు చేయొద్దని గట్టిగానే చెప్పారు బిగ్‌బాస్. అంతేకాదు వారి ఉత్సాహానికి మరో పని అప్పగించారు. గార్డెన్ ఏరియాని ఆ ముగ్గురు క్లీన్ చేయాలని తెలిపారు. దీంతో పంచ్ పడినట్టయ్యింది.
ఆ తర్వాత కాన్‌సన్‌ట్రేషన్‌కి సంబంధించిన గేమ్ ఇచ్చారు బిగ్‌బాస్. అందులో బిగ్‌బాస్ ఏం చెప్పినా డిస్టర్బ్ కాకుండా ఉండాల్సి ఉంటుంది. ఈ గేమ్ ఆద్యంతం ఎంటర్‌టైనింగ్‌గా సాగింది. అయితే టాస్క్ లో భాగంగా తనని ఇమిటేట్ చేశాడని సన్నీపై సిరి మండిపడింది. అయితే తాను కూల్‌గా చెబుతున్నానని, అరవొద్దని చెబుతూ సన్నీ వాదించాడు. వీరిద్దరి వాదన పీక్‌లోకి వెళ్లింది. మరోసారి ఇద్దరు గట్టిగా అరుచుకున్నారు. సిరి సైతం ఏమాత్రం తగ్గడం లేదు. ఇంకా చెప్పాలంటే సన్నీని మించి రెచ్చిపోయింది. ఆయనపై విరుచుకుపడింది. సన్నీసైతం రెచ్చిపోతుండగా,మానస్ అడ్డుకుని కూల్ చేసే ప్రయత్నం చేశాడు. మొత్తంగా గురువారం ఎపిసోడ్ నవ్వులతోపాటు హీటెక్కించేలా సాగిందని చెప్పొచ్చు. ఇక బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలేకు ఇంకా మూడు రోజులు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం ఫైనలిస్ట్ లుగా సన్నీ, షణ్ముఖ్, సిరి, మానస్, శ్రీరామ్‌లున్నారు. వీరిలో ఎవరు విన్నర్ అనేది ఈ సారి ఆసక్తిని రేకెత్తిస్తుంది.
