Asianet News TeluguAsianet News Telugu

నుదురు, ముఖంపై తీవ్రగాయాలు.. మిస్టరీగా వాణీ జయరాం మరణం?

నేపథ్య గాయని వాణీ జయరాం మరణానికి సంబంధించి ఇప్పుడు షాకింగ్‌ విషయాలు బయటకు వస్తున్నాయి. ఆమె తీవ్ర గాయాల స్థితిలో కన్నుమూయడం పెద్ద షాకిస్తుంది. 

singer vani jayaram death mystery severe injuries on the forehead and face ?
Author
First Published Feb 4, 2023, 3:47 PM IST

లెజెండరీ సింగర్‌ వాణీ జయరాం హఠాన్మరణం ఇప్పుడు ఇండియన్‌ చిత్ర పరిశ్రమని తీవ్ర షాక్‌కి గురి చేస్తుంది. ఆమెకి కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పద్మ భూషణ్‌ అవార్డు ప్రకటించగా, ఇంతలోనే విషాదం చోటు చేసుకోవడం దిగ్బ్రాంతికి గురి చేస్తుంది. అయితే నేపథ్య గాయని వాణీ జయరాంకి సంబంధించి ఇప్పుడు షాకింగ్‌ విషయాలు బయటకు వస్తున్నాయి. ఆమె తీవ్ర గాయాల స్థితిలో కన్నుమూయడం పెద్ద షాకిస్తుంది. 

బెడ్‌మీద నుంచి పడినట్టుగా ప్రాథమికంగా గుర్తించారు. కానీ నుదురు, ముఖంపై తీవ్రగాయాల స్థితిలో ఆమె స్పృహతప్పి పడిపోయి ఉన్నారు. తలుపు కొట్టినా బయటకు రాకపోవడంతో ఇంటి పనిమనిషి తలుపు బద్దలు కొట్టి ఆమెని బయటకు తీసుకొచ్చారు. దీంతో అప్పటికే ఆమె గాయాలతో ఉన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి రాకముందే ఆమె ప్రాణాలు విడిచినట్టు వైద్యులు వెల్లడించారు. 

వాణీ జయరాం భర్త నాలుగేండ్ల(2018) క్రితం చనిపోయారు. ఆమెకి పిల్లలు లేరు. దీంతో ఒక్కతే, ఒంటరిగా ఇంట్లో ఉంటున్నట్టు తెలుస్తుంది. దాదాపు 10-11గంటల మధ్య పని మనిషి ఇంట్లో పనిచేస్తూ ఉంటుందట. వాణీ జయరాం గాయాలతో కనిపించడంతో ఎవరో కొట్టినట్టుగా ఉందని ఆమె పోలీసులకు సమాచారం అందించారు. ఆమె కాలు జారి కింద పడిపోయి ఉంటుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇంటికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

వారం రోజులుగా ఏం జరిగిందనేది పోలీసులు ఆరా తీస్తున్నారట. ఆమె పేరుమీద ఏవైనా విలువైన ఆస్తులున్నాయా? అనేది విచారిస్తున్నారు. అయితే ఎవరైనా కొడితే తలుపులు ఎలా మూసి ఉంటాయనేది అనుమానంగా మారింది. ఈ ఘటన ఈరోజు ఉదయం 11.30గంటల సమయంలో చోటు చేసుకుందని తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసులు పూర్తిస్థాయిలో విచారిస్తున్నారు. మరికాసేపట్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఓ గొప్ప గాయని విషయంలో ఇలా జరగడం అత్యంత విచారకరం. 

Follow Us:
Download App:
  • android
  • ios