సింగర్ సునీతను అభిమానించే వారంతా.. ఈ విషయంలో సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇక సునీత్, రామ్‌ల వివాహం డిసెంబర్ 27న జరగబోతోందంటూ కూడా వార్తలు వచ్చాయి.
టాలీవుడ్ సూపర్ సింగర్ సునీత రెండో పెళ్లికి సిద్ధపడిన సంగతి తెలిసిందే. ఆమెకు గతంలోనే పెళ్లి కాగా.. మొదటి భర్తతో విడిపోయారు. కాగా.. ఇటీవల రెండో పెళ్లి నిశ్చయమైంది. డిజిటల్ మీడియా అధినేత రామ్ వీరపనేనితో రీసెంట్‌గా సునీత నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థపు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.

సింగర్ సునీతను అభిమానించే వారంతా.. ఈ విషయంలో సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇక సునీత్, రామ్‌ల వివాహం డిసెంబర్ 27న జరగబోతోందంటూ కూడా వార్తలు వచ్చాయి. అయితే.. తాజాగా వీరి వివాహం వాయిదా పడినట్లుగా వార్తలు వినవస్తున్నాయి.

కొన్ని కారణాల వల్ల వీరి వివాహం వాయిదా పడిందని, డిసెంబర్ 27న కాకుండా.. రాబోయే సంవత్సరంలో వీరి వివాహం జరగనుందని తెలుస్తోంది. వాయిదా పడటానికి కారణాలైతే తెలియరాలేదు కానీ.. నూతన సంవత్సరంలో మంచి ముహూర్తం చూసి.. సునీత, రామ్‌ల పెళ్లి జరపాలని ఇరు కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
