సింగర్ సునీత రెండో పెళ్ళికి ప్లాన్.. అతనెవరంటే?
తెలుగులో పాపులర్ సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా రాణిస్తున్న సింగర్ సునీత రెండో పెళ్ళి చేసుకోబోతున్నారు. డిజిటల్ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న ఓ వ్యక్తిని సునీత పెళ్ళి చేసుకోబోతుందట. ప్రస్తుతం దానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని తెలుస్తుంది.

సునీతకి మొదట మీడియా రంగంలో పనిచేసే కిరణ్ కుమార్ గోపరాజుతో మ్యారేజ్ జరిగింది. తన 19వ ఏజ్‌లోనే మ్యారేజ్ చేసుకుంది సునీత. వీరికి ఓ కుమారుడు, కూతురు డా ఉన్నారు. గత కొంత కాలంగా వీరిద్దరి మధ్య నెలకొన్న మనస్పార్థాలు విడాకులకు దారితీశాయి. ఇన్నాళ్ళు ఒంటరిగా ఉన్న సునీత ఇక మరోసారి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాలని, అనేక విమర్శలకు చెక్ పెట్టాలని భావిస్తుందట.
అయితే ఇటీవల ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ, ఒంటరిగానే ఉంటున్నట్టు, తనపై వస్తోన్న పుకార్లలో నిజం లేదని తెలిపింది. కానీ ఇప్పుడు మరోసారి ఆమె రెండో పెళ్ళి చేసుకోబోతుందనే వార్త వినిపించడం గమనార్హం. మరి ఇందులో నిజమెంతా అనేది చూడాలి. ఇక సునీత నటిగా, గాయనీగా, వ్యాఖ్యాతగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా రాణిస్తున్న విషయం తెలిసిందే.