ప్రముఖ తెలుగు సింగర్ సునీతపై తరచూ ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంటుందన్న విషయం తెలిసిందే. ఆమె సినీ రంగానికి చెందిన వ్యక్తి కావడం, అందంగా ఉండటం, ఇండస్ట్రీలో పాపులర్ పర్సన్ కావడం ఇందుకు కారణాలుగా చెప్తారు. మీడియా దృష్టి కూడా ఎప్పుడూ సునీతపై ఉంటుంది. దాంతో సాధారణంగా సునీత కూడా తనపై వచ్చే రూమర్స్ పెద్దగా పట్టించుకోదు. లైట్ తీసుకుంటారు.

తన మనస్సుకు గానీ, కెరీర్ కు కానీ ఇబ్బంది పెట్టే అంశాలతో కూడిన రూమర్స్ అయితే ఖచ్చితంగా ఖండిస్తారు. తాజాగా సునీతపై అలాంటి రూమర్ ఒకటి మొదలైంది. దాన్ని వెంటనే ఖండిస్తూ ప్రకటన చేసారామె. ఇంతకీ ఏమిటా రూమర్ అంటారా..
 
వివరాల్లోకి వెళితే...సినీనటుడు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్-4 త్వరలో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. బిగ్‌బాస్ సీజన్ 4 కోసం కొందరిని ఎంపిక చేశారంటూ కొన్ని పేర్లు బయటకు వచ్చాయి. వాటిల్లో సింగర్ సునీత పేరు కూడా ఉంది. బిగ్‌బాస్‌ టీమ్ అధికారికంగా ప్రకటించకముందే కొన్ని వెబ్‌సైట్లు అత్యుత్సాహంతో సునీత పేరును ప్రస్తావించాయి.

దీనిపై స్పందించిన సునీత తాను అందులో పాల్గొనట్లేదని తెలిపారు. 'నా ప్రియమైన మిత్రులారా.. నేను బిగ్‌బాస్ 4 తెలుగులో లేను.. భవిష్యత్తులోనూ ఉండను. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్' అని ఆమె తన ఫేస్‌బుక్ ఖాతాలో ప్రకటించారు. కాగా, బిగ్‌బాస్‌4 షో ప్రోమో వీడియోలను ఇప్పటికే విడుదల చేసి, ఈ షోపై మేకర్స్‌ ఆసక్తి రేకెత్తిస్తోన్న విషయం తెలిసిందే.