స్టార్ సింగర్ సునీత తిరుమల తిరుపతి దేవస్థానం సందర్శించారు. నూతన సంవత్సరం సందర్భంగా శ్రీవారిని ఆమె దర్శించుకున్నారు. దాదాపు 10నెలల తరువాత తిరుమల శ్రీ వెంకటేశ్వరుణ్ణి దర్శించుకోవడం ఆనందం కలిగించింది అన్నారు. నూతన సంవత్సరం అందరి జీవితాలలో సంతోషం నింపాలని శ్రీవారిని ప్రార్ధించినట్లు సునీత పేర్కొన్నారు. అలాగే మీడియాతో తన వివాహంపై కూడా కీలక విషయాలు వెల్లడించారు. 2021 జనవరి 9న ఆమె వివాహం చేసుకోబోతున్నట్లు వివరించారు. 


మాంగో మీడియా అధినేత రామ్ వీరపనేనితో సింగర్ సునీత నిశ్చితార్ధం జరిగిన సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం కేవలం బంధువులు మధ్య నిరాడంబరంగా నిశ్చితార్ధం జరిగింది. సునీత ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. తన ఈ నిర్ణయాన్ని గౌరవించి, మద్దతు తెలపాలని ఆమె అభిమానులు మరియు శ్రేయోభిలాషులను కోరుకున్నారు.

 
ఇక నిశ్చితార్ధం అనంతరం సునీత పరిశ్రమకు చెందిన మిత్రులకు పార్టీ  ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ లో విలాసవంతమైన హోటల్స్ లో రెండు పర్యాయాలు ప్రీ వెడ్డింగ్ పార్టీలు ఏర్పాటు చేశారు. ఈ ప్రీ వెడ్డింగ్ పార్టీలకు రేణూ దేశాయ్, యాంకర్ సుమలతో మరికొందరు ప్రముఖులు హాజరయ్యారు. రామ్, సునీత వివాహం డిసెంబర్ 27న జరగాల్సిఉండగా వాయిదా వేశారు. ఫైనల్ గా జనవరి 9న తన వివాహం అంటూ అధికారిక ప్రకటన చేశారు సునీత. 42ఏళ్ల సునీత రామ్ ని రెండో వివాహం చేసుకుంటున్న సంగతి