ప్రముఖ సింగర్‌ శ్రేయా ఘోషల్‌ పండంటి బిడ్డకి జన్మనిచ్చారు. తనకు కుమారుడు పుట్టారు. ఈ విషయాన్నిఆమె సోషల్‌ మీడియా ద్వారా తెలియజేస్తూ ఎమెషనల్‌ అయ్యారు. తాను గతంలో ఎప్పుడూ ఇంతటి అనుభూతిని పొందలేదని తెలిపారు. నేను, తన భర్త, తమ ఫ్యామిలీ ఎంతో సంతోషంగా ఉన్నారని పేర్కొంది. తమ బిడ్డకి లెక్కలేనన్ని బ్లెస్సింగ్స్ రావడాన్ని ఆమె ధన్యవాదాలు తెలిపారు.

ఇండియన్‌ సింగర్‌గా పాపులర్‌ అయిన శ్రేయా ఘోషల్‌ 2015లో వ్యాపారవేత్త శిలాధిత్య ముఖోపధ్యాయని వివాహం చేసుకుంది. ఆరేళ్ల తర్వాత వీరు పండంటి బిడ్డకి జన్మనిచ్చారు. ఇటీవల తాను ప్రెగ్నెంట్‌ అని తెలియజేస్తూ శ్రేయా ఘోషల్‌ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే.