పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, భల్లాల దేవుడు రానా దగ్గుబాటి కలసి నటిస్తున్న చిత్రం భీమ్లా నాయక్. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు భీమ్లా నాయక్ ఫీవర్ తో ఊగిపోతున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, భల్లాల దేవుడు రానా దగ్గుబాటి కలసి నటిస్తున్న చిత్రం భీమ్లా నాయక్. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు భీమ్లా నాయక్ ఫీవర్ తో ఊగిపోతున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా విడుదలవుతుంటే హంగామా ఒక రేంజ్ లో ఉంటుంది. అమలాపురం నుంచి అమెరికా వరకు పవన్ ఫ్యాన్స్ భీమ్లా నాయక్ జపం చేస్తున్నారు. నేడు హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. 

దీనితో భీమ్లా నాయక్ మ్యానియా పీక్స్ కి చేరుకుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తెలంగాణ మంత్రి కేటీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరవుతుండడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. పొలిటికల్ గా ఎలా ఉన్నా.. కేటీఆర్, పవన్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. దీనితో వీరిద్దరూ ఒకే వేదికపై కనిపించనుండడం ఆసక్తిగా మారింది. 

భీమ్లా నాయక్ చిత్రంలో టైటిల్ సాంగ్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సాంగ్ లో మొగిలయ్య ఒకెత్తయితే.. గుంటూరు కారం.. ఆ యూనిఫారం అంటూ ఇరగదీసిన సింగర్ రామ్ మిర్యాల మరో ఎత్తు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రామ్ మిర్యాల మాట్లాడుతూ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. 

ఈచిత్రంలో సాంగ్ పాడే అవకాశం రావడం నా అదృష్టం, నేను పవన్ అభిమానిని.. ఇది పక్కన పెడితే ఈ వేదిక మీదుగా పవన్ సర్ కి ఓ విషయం చెప్పాలనుకున్నా. మాది పిఠాపురం దగ్గర కోళంకి అనే చిన్న గ్రామం. ఈ చిత్రంలో పాట పాడానని మా ఊరు మొత్తం సెలెబ్రేట్ చేసుకుంది అని రామ్ మిర్యాల అన్నారు. మా ఊరి గురించి చెప్పే సందర్భం ఇంతకు మించి రాదు అంటూ రామ్ మిర్యాల తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. 

పవన్ ఫ్యాన్స్ లో, ట్రెండ్ వర్గాల్లో భీమ్లా నాయక్ చిత్రంపై కనీవినీ ఎరుగని అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో పవన్ కి జోడిగా తొలిసారి నిత్యామీనన్ నటిస్తోంది. అలాగే రానా సరసన సంయుక్త మీనన్ నటిస్తోంది. మురళి శర్మ, రావు రమేష్, సముద్ర ఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు.