Asianet News TeluguAsianet News Telugu

లైవ్ షో జరుగుతుండగా సింగర్ పై కాల్పులు.. తీవ్రంగా గాయపడ్డ గాయని నిషా

జానపద పాటలు పాడే యువ గాయని నిషా ఉపాధ్యాయ్ పై ఊహించని విధంగా కాల్పులు జరిగాయి. బీహార్ లోని పాట్నాలో ఈ ఘటన చోటు చేసుకుంది. భోజ్ పురి లో జానపద గాయనిగా నిషా ఉపాధ్యాయ్ బాగా ఫేమస్ అయ్యారు. 

Singer Nisha Upadhyay injured in gun firing dtr
Author
First Published Jun 2, 2023, 9:54 AM IST | Last Updated Jun 2, 2023, 9:54 AM IST

జానపద పాటలు పాడే యువ గాయని నిషా ఉపాధ్యాయ్ పై ఊహించని విధంగా కాల్పులు జరిగాయి. బీహార్ లోని పాట్నాలో ఈ ఘటన చోటు చేసుకుంది. భోజ్ పురి లో జానపద గాయనిగా నిషా ఉపాధ్యాయ్ బాగా ఫేమస్ అయ్యారు.  తరచుగా ఆమె కల్చరల్ ఈవెంట్స్ లో పెర్ఫామ్ చేస్తూ తన గాత్రంతో అభిమానులని ఉర్రూతలూగిస్తూ ఉంటారు. 

అలాంటి నిషా ఉపాధ్యాయ్ తీవ్రమైన బులెట్ గాయానికి గురై ఆసుపత్రిపాలయ్యారు. పాట్నాలో కల్చరల్ ఈవెంట్ లో ఆమె లైవ్ పెర్ఫామెన్స్ ఇస్తుండగా కొందరు ఆమెపై కాల్పులు జరిపారు. ఓ ఉత్సవం లో భాగంగా కొందరు గాల్లోకి కాల్పులు జరుపుతూ ప్రమాదవశాత్తూ నిషా పై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. 

అయితే విషయాన్ని పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు. ఈ ఘటనలో నిషా ఎడమ థైస్ కి బులెట్ బలంగా తాకినట్లు తెలుస్తోంది. వెంటనే ఆమెని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నిషా కండిషన్ నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటనపై పోలీసులు మాట్లాడుతూ గాయని నిషా కాల్పుల్లో గాయపడ్డట్లు మా దృష్టికి వచ్చింది. అయితే దీనిపై ఎవరూ కంప్లైంట్ ఇంతవరకు చేయలేదు. 

కాల్పులు ఎలా జరిపారు... ఎవరు చేసారు లాంటి విషయయలపై దర్యాప్తు చేస్తున్నాము అని పోలీసులు అన్నారు. నిషా త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు ప్రార్థిస్తున్నారు. 

నిషా లేలే ఆయా కోకా కోలా, నవకర్ మంత్ర లాంటి పాటలతో నిషా ఉపాధ్యాయ్ గుర్తింపు పొందారు. హోమం జరుగుతుండగా అక్కడ సంబరాల్లో భాగంగా కొందరు కాల్పులు జరిపారు. అక్కడ మిస్ ఫైరింగ్ జరిగి నిషాకి బుల్లెట్ తలిగింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios