ప్రముఖ సింగర్ నాగూర్ బాబు అలియాస్ మనో రాజకీయాల్లోకి ప్రవేశించారు. అన్నాడీఎంకే నుండి విభేదించి సొంత పార్టీ పెట్టుకున్న శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ పార్టీ ఏఎంఎంకేలో ఆయన శనివారం నాడు చేరారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను తెలుగు వాడినే అయినప్పటికీ 35 ఏళ్లుగా తనకు తమిళనాడుతో విడదీయలేని అనుబంధం ఉందని అన్నారు. ముక్కుసూటిగా వ్యవహరించే దినకరన్ వ్యక్తిత్వం, ఆలోచనా విధానం నచ్చి ఆయన పార్టీలో చేరానని తెలిపారు.

దక్షిణాది భాషల్లో పలు చిత్రాల్లో 25 వేలకు పైగా పాటలు, భక్తిగీతాలను ఆలపించిన మనో.. ప్రత్యేక ఆల్బమ్ లను కూడా రూపొందించారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన నాగూర్ బాబు గాయకుడిగా పరిచయం కాకముందు చైల్డ్ ఆర్టిస్ట్ గా 'నీడ' అనే చిత్రంలో నటించారు.

గాయకుడిగానే కాకుండా తన నటనతో కూడా మెప్పించిన మనో.. పలు తమిళ చిత్రాలలోనూ నటించారు.